పెద్ద పెద్ద పొట్టలుంటేనే అక్కడ హీరోలు.. పచ్చి రక్తం తాగుతున్న తెగ (వీడియో)

by Hamsa |   ( Updated:2023-10-10 11:06:46.0  )
పెద్ద పెద్ద పొట్టలుంటేనే అక్కడ హీరోలు.. పచ్చి రక్తం తాగుతున్న తెగ (వీడియో)
X

దిశ, ఫీచర్స్: ఈ మోడ్రన్ లైఫ్‌లో ఊబకాయం, పెద్ద పొట్టలు కలిగి ఉండటం వల్ల బాడీ షేమింగ్‌కు గురవుతుంటారు. పొట్టను తగ్గించుకునేందుకు నంబర్ ఆఫ్ వర్కవుట్స్ చేస్తుంటారు. దీని కారణంగా డిప్రెషన్‌ను ఎదుర్కొని మానసికంగా డిస్టర్బ్ అయిన సందర్భాలు కూడా ఉంటాయి. కానీ దక్షిణ ఇథియోపియా ఓమో వ్యాలీలోని ‘బోడి’ తెగ మాత్రం ఈ పెద్ద పొట్టలను ఆకర్షణీయంగా పరిగణిస్తుంది. జూన్ లేదా జూలై మాసంలో ప్రతి ఏట ‘కాయెల్’ అని పిలువబడే పండుగను జరుపుకుంటోంది. ఆ తెగలో పెద్ద పొట్ట ఉన్న వ్యక్తికి ‘ఫ్యాట్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్’ కిరీటాన్ని అందించి సత్కరిస్తుంది.

బోడి తెగకు చెందిన పురుషులు సాధారణంగా సన్నగా ఉంటారు. ఈ క్రమంలో పెద్ద పొట్టను పొందేందుకు, కిరీటాన్ని చేజిక్కించుకునేందుకు పండుగకు ఆరు నెలల ముందు నుంచే క్రూయల్ ప్రిపరేషన్స్ స్టార్ట్ చేస్తారు. శారీరక కార్యకలాపాలకు పూర్తిగా దూరంగా ఉంటూ.. ఆవు పాలు, పెరుగు, పచ్చి రక్తం, తేనెతో కూడిన ఆహారం తీసుకుంటారు. ప్రోటీన్లు అధికంగా ఉండే మిశ్రమాన్ని తీసుకోవడం మూలంగా వాంతులు చేసుకుంటారు. అయినా సరే తెగ అందించే గౌరవాన్ని పొందేందుకు అన్నింటిని ఓర్చుకుంటూ ముందుకు సాగుతారు. మొత్తానికి ఊబకాయంతో కనీసం కదలలేని స్థితికి చేరుకుంటారు. చివరకు పండుగ రోజున.. పురుషులు తమ శరీరానికి మట్టి, బూడిదను రాసుకుని, తమ లావు పొట్టలను ప్రదర్శిస్తారు. గిరిజనులు ఎక్కువగా పొడుచుకు వచ్చిన పొట్ట ఉన్న వ్యక్తికి ఓటు వేస్తారు. విజేతను ‘ఫ్యాట్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్’ ప్రకటించి..వారిని జీవితాంతం స్థానిక హీరోలుగా పరిగణిస్తారు. ఇక పండుగ తర్వాత పురుషుల పొట్టలు కొన్ని వారాల్లోనే వారి సాధారణ పరిమాణానికి తగ్గుతాయి.

Advertisement

Next Story