బ్లైండ్ గార్ల్ బాస్కెట్ బాల్ ఆడితే..?! ఇలా ఉంటుంది (వీడియో)

by Sumithra |
బ్లైండ్ గార్ల్ బాస్కెట్ బాల్ ఆడితే..?! ఇలా ఉంటుంది (వీడియో)
X

దిశ‌, వెబ్‌డెస్క్ః విభిన్న ప్ర‌తిభావంతులు ఎంతో మంది మ‌న క‌ళ్ల ముందే క‌దులుతుంటారు. అవ‌య‌వ లోప‌మే కానీ ప్ర‌తిభ‌, నైపుణ్యాల విష‌యంలో ఏమాత్రం త‌క్కువకాద‌ని నిరూపిస్తుంటారు. దీనికి మ‌రో ఉదాహ‌ర‌ణే ఈ 17 ఏళ్ల హైస్కూల్ బాలిక. బ్లైండ్ అయిన‌ప్ప‌టికీ బాస్కెట్‌బాల్ గేమ్‌లో స్కోర్ చేస్తున్న వీడియోను చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఈ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. ఇంట‌ర్ స్కూల్ గేమ్స్‌లో జూల్స్ హూగ్లాండ్ అనే అమ్మాయి బాస్కెట్ బాల్‌ని హోప్ నుండి కొన్ని అడుగుల దూరంలో నిలబడి షాట్‌ చేస్తుంది. అప్ప‌టి వ‌ర‌కూ ఉత్కంఠంగా చూస్తున్న స్టాండ్స్‌లో ప్రేక్షకులందరూ ఈ అమ్మాయి నైపుణ్యాన్ని చూసి చ‌ప్ప‌ట్ల‌తో ప్ర‌శంసిస్తారు. జీలాండ్ పబ్లిక్ స్కూల్స్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియో పోస్ట్ చేసిన త‌ర్వాత‌, ఇప్పటికే దాదాపు 4 మిలియన్ల వ్యూవ్స్‌, వేల‌ల్లో రీట్వీట్‌లు, వంద‌ల్లో స్పంద‌న‌లు సంపాదించింది.

Advertisement

Next Story