- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Birds : చెట్ల కొమ్మలపై నిద్రపోతున్నప్పుడు పక్షులు ఎందుకని కిందకు జారిపడవు?

దిశ, ఫీచర్స్ : ఒక్కసారి గాఢమైన నిద్రలోకి జారుకుంటే చాలు బయటి ప్రపంచంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. కదిపి లేపినా త్వరగా మేల్కోవడం కష్టం. కొందరైతే నిద్రలో పలువరించడం, బెడ్ మీద పడుకున్నప్పుడు ఉలిక్కి పడటం, కింద జారిపడటం వంటి అనుభవాలను కూడా ఎదుర్కొంటుంటారు. అంటే నిద్రాణ స్థితిలో సరైన స్పృహ లేకపోవడమే ఇందుకు కారణం. మనుషులందరిలోనూ ఉండే సహజమైన ప్రక్రియ ఇది. కానీ పక్షుల్లో మాత్రం అలా ఉండదంటున్నారు నిపుణులు. అవి రాత్రి మొత్తం చెట్ల కొమ్మలపైనే తమ రెండుకాళ్లతో పట్టుకొని కూర్చుంటాయి. అలాగే నిద్రపోతాయి. కానీ కింద మాత్రం జారిపడవు. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ.. కారణమేంటో తెలుసా ?
అనేక వింతలు, సరికొత్త విశేషాలు మనల్ని ఎప్పుడూ ఆకట్టుకుంటాయి. అలాంటి వాటిలో పక్షులూ ఉన్నాయి. వాటి జీవన శైలి గురించి తెలుసుకోవాలన్న ఉత్సుకత కూడా మనలో సహజంగానే ఉంటుంది. వర్షం పడ్డప్పుడు గూటిలో తలదాచుకునే చాలా పక్షులు, మిగతా సమయాల్లో గూటి బయట చెట్ల కొమ్మలపై కూర్చొనే నిద్రపోతుంటాయని, వలస వెళ్తున్న క్రమంలో మధ్య మధ్య చెట్లపై వాలుతూ.. రాత్రిళ్లు కూడా వాటిపైనే నిద్రపోతూ ఉంటాయని నిపుణులు అంటున్నారు. అయితే పక్షులు రాత్రిళ్లు చెట్లపై నిద్రలోకి జారుకున్నప్పుడు అవి ఎందుకని కిందరకు జారిపడవు? అనే సందేహం మీకెప్పుడైనా కలిగిందా? శాస్త్రవేత్తల ప్రకారం.. పక్షులు గాఢ నిద్రలో ఉన్నప్పటికీ, ఒక కన్ను తెరిచి నిద్రపోతాయి. ఈ సమయంలో వాటి మెదడులోని ఒక భాగం యాక్టివ్‌గా పనిచేస్తుంది. అంటే ఓ వైపు నిద్రపోవడం, ఇంకో వైపు తెరిచి ఉన్న కంటి భాగం, మెదడులోని ఒక భాగానికి మధ్య ఉండే కనెక్షన్‌తో స్పృహతో కూడిన సమాచార ప్రాసెస్ కూడా జరుగుతుంది. దీంతో పక్షులు నిద్రలో కిందపడకుండా జాగ్రత్త పడతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. అంతేకాకుండా పక్షుల లెగ్ స్ట్రక్చర్ కూడా చెట్ల కొమ్మలను చుట్టి పట్టుకున్నప్పుడు జారకుండా ఉండేందుకు అద్భుతంగా సహాయపడుతుంది.