- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
3 నెలలు మండిపోనున్న ఎండలు.. హెచ్చరిస్తోన్న వాతావరణ శాఖ.. ఈ చిట్కాలు పాటించక తప్పదంటున్న నిపుణులు!
దిశ, ఫీచర్స్: చూస్తుండగానే ఎండాకాలం రానే వచ్చేసింది. ఈ సారి ఎండలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి నెలకారులోనే భగ్గుమంటున్న ఎండల కారణంగా ప్రజలు మూలన పడ్డ ఏసీలు, కూలర్లు, రిఫ్రిజిరేటర్లు, ఫ్యాన్స్ ఉపయోగించడం స్టార్ట్ చేశారు. ఎండాకాలం రావడం వల్ల జనాలకు కరెంటు బిల్లు కూడా ఎక్కువగానే వస్తుందని చెప్పుకోవచ్చు. అయితే వచ్చే మూడు (ఏప్రిల్, మే, జూన్) వేడిగాలులు పెరిగే అవకాశముందని.. ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఎండ తీవ్రత వల్ల డీహైడ్రేషన్, సన్ స్ట్రోక్, విపరీతమైన తలనొప్పి వంటి అనేక వ్యాధులు తలెత్తుతాయి. కాగా వైద్య నిపుణులు సోషల్ మీడియాలో పలు సలహాలు ఇస్తున్నారు. భగ్గుమంటోన్న నుంచి విముక్తి పొందే ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
సూర్యుని నుంచి కాపాడే పలు చిట్కాలు..
* వీలైనంత వరకు కాటన్ దుస్తులు ధరించండి.
* ఎక్కువగా మార్నింగ్ సమయంలో లేదా ఈవెనింగ్ టైంలో బయటకు వెళ్లండి. మిట్టమధ్యాహ్నం వెళ్లడం మానుకోండి.
* ఒకవేళ ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే వైట్ కలర్ గొడుగు వాడండి.
* ముఖ్యంగా వృద్ధులు, పిల్లల పట్ల ఎక్కువ కేర్ తీసుకోండి. వీరికి వాటర్ ఎక్కువగా ఇవ్వండి.
* ఎండాకాలంలో పొరపాటున కూడా నలుపు, నీలం కలర్ దుస్తులు వేసుకోవద్దు. ఈ రంగులు సూర్యరశ్మిని త్వరగా గ్రహిస్తాయి.
* మార్నింగ్ లేవగానే తులసి ఆకులను మిక్సీలో వేసి మెత్తగా నూరి రెండు గ్లాసుల నీళ్లలో యాడ్ చేసుకుని తాగండి. అలసట నుంచి విముక్తి పొందుతారు.
* ఎండాకాలం విటమిన్ సి లోపిస్తుంది. కాగా నిమ్మరసాన్ని ఎక్కువగా తీసుకోండి.
* చక్కెరకు బదులు బెల్లం ఉపయోగించండి.
* ఈ సమయంలో తల, మెదడు చల్లగా ఉండాలి. కాబట్టి రెండ్రోజుల కొకసారి నైట్ పడుకునేటప్పుడు కొబ్బరి నూనెకు బదులు పటిక నూనె రాసుకోవాలి. మళ్లీ ఉదయాన్నే తలస్నానం చేయాలి.
* ఎండాకాలంలో ఎక్కువ మసాలాలు వాడొద్దు. మసాలాల వల్ల మలద్వారంలో వేడి ఎక్కువై మలవిసర్జనలో ఇబ్బంది ఏర్పడి.. పైల్స్ వచ్చే వచ్చే చాన్స్ ఉంటుంది.
* పెరుగుకు బదులుగా మజ్జిగను వాడండి.
* పడుకునే ముందు చల్లటి నీళ్ల గుడ్డతో నేలను తుడిచి పల్చని గుడ్డపై పడుకోవడం మంచిది, మంచం మీద నుంచి శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది.
* గింజలను అరగంట సేపు వాటర్ లో నానబెట్టి తర్వాత మిక్సీలో జ్యూస్ తయారు చేసుకుని రోజుకు రెండుసార్లు తాగితే బాడీ కూల్ గా ఉంటుంది.
* 5 ఏళ్లలోపు పిల్లలు డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండాలంటే ప్రతి 30 నిమిషాలకొకసారి చిటికెడు అయోడైజ్డ్ సాల్ట్ ను వాటర్ లో కలిపి తాగించండి.
* వేసవిలో చల్లటి నీళ్ల స్నానం ఆరోగ్యానికి మంచిది. ప్రతి రోజూ రెండు సార్లు అంటే.. మార్నింగ్ అండ్ పడుకునే ముందు ఒక బకెట్ లో 10 పుదీనా ఆకులు వేసి తలస్నానం చేయండి.