Best makeup tips: మేకప్ వల్ల చర్మం పాడవుతుందా? నిపుణులు చెప్పే బెస్ట్ టిప్స్ మీ కోసం

by Anjali |
Best makeup tips: మేకప్ వల్ల చర్మం పాడవుతుందా? నిపుణులు చెప్పే బెస్ట్ టిప్స్ మీ కోసం
X

దిశ, ఫీచర్స్: అమ్మాయిలు మేకప్‌కు ఎంత ప్రాధాన్యత ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పార్టీలు, ఫంక్షన్స్‌కు వెళ్లే మేకప్ లేనిది అస్సలు అటెండ్ కారనుకో. మేకప్ పట్ల అంతగా శ్రద్ధ వహిస్తారు. కొంతమందైతే నార్మల్‌గా బయటికి వెళ్లినా మేకప్ వేసకుని మరీ వెళ్తారు. కానీ మేకప్‌ను ఎలా ఉపయోగించాలి అనే విషయాన్ని మాత్రం మర్చిపోతారు.

రోజూ మేకప్ వేసుకోవడం వల్ల చర్మంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని తాజాగా నిపుణులు చెబుతున్నారు. మేకప్ ఉత్పత్తుల్లో కెమికల్స్ కారణంగా స్కిన్ దెబ్బతింటుందని, చర్మం పొడిబారడం, పింపుల్స్ రావడం, చిన్న వయసులో వృద్ధాప్య ఛాయలు రావడం వంటి సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. కాగా ప్రీ, పోస్ట్ మేకప్ వేసుకుంటే.. స్కిన్‌ కాపాడుకునే అవకాశాలున్నాయని అంటున్నారు. మేకప్ నుంచి చర్మాన్ని ఎలా రక్షించుకోవాలో ఇప్పుడు చూద్దాం..

సరైన బేస్ అప్లై చేయడం..

మేకప్ వేసుకునే విషయంలో అమ్మాయిలు చాలామంది తప్పులు చేస్తుంటారు. మేకప్ వేసుకునే ముందు స్కిన్‌కు ఫౌండేషన్, బిబి క్రీమ్‌లు పెడుతుంటారు కదా? ఇవి పెట్టే ముందు మాయిశ్చరైజర్‌లు, సన్‌స్క్రీన్‌లు అప్లై చేసుకుంటే చాలా బెటర్.

సహజ ఉత్పత్తులకు ప్రధాన్యత ఇవ్వడం..

మేకప్‌లో విషపూరితమైన కెమిలకల్స్ ఉంటాయి. మేకప్ ఉత్పత్తులకు రంగు, సువాసన రావడానికి వాటిలో కెమికల్స్ బాగా వాడుతారు. దీంతో చర్మం పాడవుతుంది. అలాగే కాన్స్‌ర్ ముప్పు కూడా ఉంది. చర్మానికి మాత్రమే కాకుండా ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుంది. అందుకే సహాజమైన ఉత్పత్తలకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

మేకప్ బ్రష్‌లను క్లీన్‌గా ఉంచుకోవడం..

కొంతమంది ఫేస్‌కు మేకప్ అప్లై చేసుకునే బ్రష్‌లను, స్పాంజ్‌లను శుభ్రం చేయరు. క్లీన్ చేయకపోవడం వల్ల స్కిన్‌పై పింపుల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాగా మేకప్ బ్రష్‌లను యాంటీ సెప్టిక్ లిక్విడ్‌ సబ్బుతో డీప్ క్లీన్ చేయాలి. బ్యూటీ బ్లెండర్ క్లెన్సర్ యూజ్‌ చేసి మరీ స్పాంజ్‌లను క్లీన్ చేయాలి. ఇవి స్పాంజ్‌‌పై ఉన్న కన్సీలర్, ఫౌండేషన్ మరకలను పొగొడుతంది. కాగా స్పాంజ్‌లను, బ్రష్‌లను వారానికి 2 రెండు సార్లైనా శుభ్రం చేయడం మంచిదంటున్నారు నిపుణులు.

మేకప్ క్లీన్ చేసే పద్ధతి..

మేకప్ వేసుకున్నాక.. కొంతమంది దాన్ని రిమూవ్ చేయకుండానే పడుకుంటారు. దీంతో చర్మ సమస్యలు ఎదురవుతాయి. మరికొంతమంది మేకప్ తీసేముందు స్కిన్‌ను గట్టిగా రుద్దుతూ క్లీన్ చేస్తారు. దీంతో చర్మం డ్యామేజ్ అవుతుంది. కాగా మేకప్ రిమూవ్ చేసే ముందు బయట దొరికే మేకప్‌ను తొలగించే క్లెన్సర్లు వాడాలి. ఒక కాటన్ ప్యాడ్‌పై దీన్ని వేసి ఫైస్ ‌పై అప్లై చేయాలి. దీంతో మేకప్ కరిగిపోతుంది. అప్పుడు మేకప్ తీసేయడం ఈజీ అయిపోతుంది. మేకప్ తీశాక కొబ్బరి నూనెను ముఖానికి అప్లై చేయండి. దీంతో స్కిన్ స్మూత్‌గా అవుతుందంటున్నారు నిపుణులు.

Advertisement

Next Story

Most Viewed