పసుపు పాలతో కీళ్లనొప్పులు దూరం... కానీ ఇలా తీసుకోండి..

by Sujitha Rachapalli |
పసుపు పాలతో కీళ్లనొప్పులు దూరం... కానీ ఇలా తీసుకోండి..
X

దిశ, ఫీచర్స్ : పసుపు పాలు వైద్య ప్రయోజనాలను కలిగి ఉన్న సంప్రదాయ పానీయం. దీన్ని గోల్డెన్ మిల్క్ గా కూడా పేర్కొంటారు. ఇందులో ఉండే ప్రత్యేక పోషకాల కారణంగా ఆయుర్వేదంలో వినియోగిస్తుంటారు. గుండె ఆరోగ్యం నుంచి బ్రెయిన్ హెల్త్ వరకు దీనివల్ల అనేక బెనిఫిట్స్ ఉండగా.. అవేంటో చూద్దాం.

  • పసుపు పాలలో ఉండే యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు... ఆస్టియో ఆర్థరైటిస్ వల్ల వచ్చే కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి.
  • అంతేకాదు బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరోట్రోఫిక్ ఫ్యాక్టర్ ను మెరుగుపరుస్తుంది. మెదడు కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
  • పసుపులోని కర్కుమిన్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. పాలలోని పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. రెండింటి కలయిక గుండెకు మేలు చేస్తుంది.
  • ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల కణాల నష్టం, ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడతాయి.
  • వీటిలోని థెర్మోజెనిక్ లక్షణాలు జీవక్రియను పెంచుతాయి. బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తాయి.
Advertisement

Next Story