రాక్ సాల్ట్‌తో మెరిసే చర్మం మీ సొంతం... ఇలా చేశారంటే బెస్ట్ రిజల్ట్స్

by Sujitha Rachapalli |
రాక్ సాల్ట్‌తో మెరిసే చర్మం మీ సొంతం... ఇలా చేశారంటే బెస్ట్ రిజల్ట్స్
X

దిశ, ఫీచర్స్ : రాక్ సాల్ట్.. పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి ముఖ్యమైన ఖనిజాలతో కూడిన సహజ ఉప్పు. ప్రాసెస్ చేయబడిన టేబుల్ ఉప్పు మాదిరిగా కాకుండా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. కాగా మన రోజువారీ ఆహారంలో దీన్ని చేర్చేందుకు గల ముఖ్యమైన కారణాలు తెలుసుకుందాం.

జీర్ణక్రియ

రాక్ సాల్ట్ మెరుగైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. జీర్ణ ఎంజైములను ప్రోత్సహించడం ద్వారా ఉబ్బరం నుంచి ఉపశమనం అందిస్తుంది.

ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్

ఇందులోని మినరల్స్ సరైన ఎలక్ట్రోలైట్ స్థాయిలను మెయింటెయిన్ చేసేందుకు హెల్ప్ చేస్తుంది. కండరాల నొప్పి, అలసటను తగ్గిస్తుంది.

శ్వాసకోశ ఆరోగ్యం

రాక్ సాల్ట్ వేసిన నీటితో ఆవిరి పట్టడం వలన శ్వాస తీసుకోవడం సులభం అవుతుంది. ముక్కు భాగాలను క్లియర్ చేస్తుంది. సైనస్ రద్దీ నుంచి ఉపశమనం ఇస్తుంది.

చర్మ ఆరోగ్యం

ఈ ఉప్పులోని మినరల్స్ చర్మాన్ని ఎక్స్ ఫోలియేట్ చేయడానికి, ఆరోగ్యకరమైన మెరుపు కోసం స్కిన్ డిటాక్స్ చేయడానికి సహాయపడుతాయి.

బరువు నియంత్రణ

జీర్ణక్రియను బూస్ట్ చేసే రాక్ సాల్ట్.. అదనపు ఆహారపు కోరికలను తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన బరువు నిర్వహణకు తోడ్పడుతుంది.

Advertisement

Next Story

Most Viewed