- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మెదడు ఆరోగ్యానికి దానిమ్మ ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు!
దిశ, ఫీచర్స్: విటమిన్ సి, ఫోలేట్, ఫైబర్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ పొటాషియం పుష్కలంగా ఉండే దానిమ్మ.. మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని హార్వర్డ్ శిక్షణ పొందిన మనోరోగ వైద్యుడు, ప్రొఫెషనల్ చెఫ్ అండ్ న్యూట్రిషన్ స్పెషలిస్ట్ డాక్టర్ ఉమా నాయుడు వెల్లడించారు. దానిమ్మ పండులో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఎవరైనా దానిమ్మ తింటే తొందరగా క్యూర్ అవుతారు. అనేక రోగాలను నయం చేస్తున్న దానిమ్మ జ్యూస్ తాగితే మెదడు చురుగ్గా పని చేయడమే కాకుండా.. జ్ఞాపక శక్తిని పెంచడంలో, మంచి నిద్రను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. దీనిలో ఉండే మెగ్నీషియం కండరాల సడలింపు అండ్ నాడీ వ్యవస్థను ఫ్రీగా ఉంచడంలో మేలు చేస్తుంది. అలాగే నిద్రలేమి లక్షణాలను తగ్గించడంలో తోడ్పడుతుంది.
దానిమ్మ గింజలు చిగుళ్ళను బలపర్చి, వదులుగా మారిన పళ్ళను గట్టిపరుస్తాయి. జీర్ణ వ్యవస్థను మెరుగ్గా పని చేసేలా చేస్తాయి. బరువు తగ్గాలనుకునేవారికి దానిమ్మ రసం తీసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుందంటున్నారు నిపుణులు. కాగా మీ మెదడు ఎల్లప్పుడూ చురుగ్గా, ఆరోగ్యంగా ఉండాలంటే.. దానిమ్మ గింజల జ్యూస్ తాగండి. అలాగే మీ ఇంటి వద్దనున్న దానిమ్మ చెట్ల కాయలతోనే జ్యూస్ తయారు చేసుకుని తాగితే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే వాణిజ్య రసాలలో చాలా ఎక్కువ చక్కెర కంటెంట్ ఉంటుంది.