Curd : వర్షాకాలంలో పెరుగు తింటే ఎన్ని లాభాలో..

by Sumithra |   ( Updated:2024-08-13 03:07:18.0  )
Curd : వర్షాకాలంలో పెరుగు తింటే ఎన్ని లాభాలో..
X

దిశ, ఫీచర్స్ : పెరుగు మనిషికి బలాన్నిచ్చే ఆహారాల్లో అత్యున్నతమైనది. ఇందులో ఉండే ప్రోటీన్స్, ఎస్సెన్షియల్ విటమిన్లు, ఖనిజాలు మనలో శక్తిని పెంపొందింపజేస్తాయి. పాలలో ఉండే ప్రోటీన్స్ కంటే పెరుగులో ఉండే ప్రోటీన్స్ ని మన శరీరం త్వరగా జీర్ణం చేసుకుంటుంది. పెరుగు తీసుకున్న తర్వాత 1 గంటలో 91 శాతం జీర్ణం అయితే అదే సమయంలో పాలు 32 శాతం మాత్రమే జీర్ణం అవుతాయని పరిశోధకులు చెబుతున్నారు. జీర్ణ వ్యవస్థ మందకొడిగా ఉండే వాళ్ళకు పెరుగు అమృతం వంటిది. ముఖంగా పిల్లలు, వయసు మళ్లిన వారిలో పెరుగు వారి జీర్ణ శక్తిని అనుసరించి పనిచేస్తుంది.

అంతే కాదు పెరుగులో ఉండే బ్యాక్టీరియా పొట్టకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఎముకలను, కండరాలను ధృడంగా ఉంచేందుకు పెరుగు ఎంతగానో ఉపయోగపడుతుందంటున్నారు వైద్యనిపుణులు. అందుకే చాలా మంది పెరుగును ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఆ సీజన్ ఈ సీజన్ అనే తేడా లేకుండా తెగ లాగించేస్తుంటారు. కొంతమంది మాత్రం వర్షాకాలంలో, చలికాలంలో పెరుగు తినడం వలన జలుబు, దగ్గు వస్తుందని భ్రమ పడుతూ ఉంటారు. అయితే కొన్ని నివేదికల ప్రకారం, కొంతమంది వైద్యనిపుణులు తెలిపిన వివరాల ప్రకారం వర్షాకాలంలోనూ పెరును నిస్సందేహంగా తీసుకోవచ్చంటున్నారు. రెయినీ సీజన్ లో ప్రతిరోజు రెండు పూటల 200 గ్రాముల పెరుగును ఆహారంలో చేర్చుకుంటే మలబద్ధకం ఉన్నవారికి ఆ సమస్య ఇట్టే పోతుందంటున్నారు నిపుణులు.

అలాగే ఈ సీజన్ లో పెరుగు తింటే డయోరియా వంటి వ్యాధులు కూడా దరిచేరవంటున్నారు. అంతే కాదండోయ్ ఊబకాయంతో, అధిక బరువుతో బాధపడేవారికి కూడా ఈ పెరుగు బరువు తగ్గడంలో ఎంతగానో సహాయపడుతుందంటున్నారు. చర్మం పొడిబారకుండా నిగనిగలాడేలాగా చేస్తుందట. గుండెను ఆరోగ్యంగా ఉంచి, గుండె పనితీరును కూడా మెరుగు పరుస్తుందంటున్నారు. అలాగే ఇందులో ఉండే కాల్షియం, ప్రొటీన్, విటమిన్ డి వంటి పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతుందంటున్నారు నిపుణులు. కానీ పెరుగును ఎప్పుడూ కూడా రాత్రివేళల్లో కాకుండా ఉదయం కానీ లేదా మధ్యాహ్న సమయంలో తినాలంటున్నారు వైద్యులు నిపుణులు. అతిగా తిన్నా కూడా అనారోగ్య సమస్యలు వస్తాయట. అందుకే వర్షాకాలంలో పెరుగు భుజించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక వేళ రాత్రివేళల్లో పెరుగు తినే అలవాటు ఉన్నవారు తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి, లేదంటే జీర్ణ సమస్యలు రావచ్చంటున్నారు.

గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు తప్పకుండా నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed