Beetroot : ఆ ఇంట్రెస్ట్ తగ్గుతోందా..? బీట్ రూట్‌ను ఇలా ట్రై చేశారంటే!

by Javid Pasha |
Beetroot : ఆ ఇంట్రెస్ట్ తగ్గుతోందా..? బీట్ రూట్‌ను ఇలా ట్రై చేశారంటే!
X

దిశ, ఫీచర్స్ : పోషకాల లోపంతో ఇబ్బంది పడుతున్నారా?.. దాంపత్య జీవితంలో లైంగిక కోరికలు తగ్గాయా? ‘అయితే మీ రోజువారీ ఆహారంలో బీట్‌రూట్ చేర్చుకోండి’ అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఇందులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు వంటివి సమృద్ధిగా ఉంటాయి. అలాగే విటమిన్ సి, ఐరన్, డైటరీ ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు కూడా ఫుల్లుగా ఉంటాయని, పైగా స్త్రీ, పురుషుల్లో లైంగిక సామర్థ్యాన్ని, ఆసక్తిని పెంచడంలో బీట్ రూట్ సహాయపడుతుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. శరీరంలో రక్త ప్రసరణను మెరుగు పర్చడం ద్వారా గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

ఆహారంలో భాగంగా తీసుకున్నప్పుడు బీట్‌రూట్‌లో ఉండే నైట్రేట్లు ఉంటాయి. నైట్రిక్ ఆక్సైడ్‌గా మారి రక్త ప్రవాహాన్ని మెరుగు పరుస్తాయి. హార్మోన్ల సమతుల్యతకు దోహదం చేయడంతోపాటు లైంగిక శక్తిని పెంచుతాయి. అలాగే ఇందులోని బోరాన్, బీటైన్ వంటి సమ్మేళనాలు శక్తిని అందించడం ద్వారా లైంగిక సామర్థ్యాన్ని పెంచుతాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. అలాగే స్త్రీ, పురుషుల్లో ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్ లైంగిక హార్మోన్ల ఉత్పత్తిలో బీట్‌రూట్ కీలకపాత్ర పోషిస్తుందని చెప్తారు. వివిధ వంటకాల్లోనే కాకుండా బీట్‌రూట్‌ను జ్యూస్, సలాడ్‌, స్మూతీలు, సూప్‌ల రూపంలోనూ యూజ్ చేయవచ్చు. అలెర్జీలు, కిడ్నీల్లో రాళ్లు, కడుపులో ఉబ్బరం, అజీర్తి, వికారం వంటి సమస్యలను నివారించడంతోపాటు లైంగిక శక్తిని పెంచడంలో ఇవి ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed