- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పర్పుల్ కలర్ తేనెను ఉత్పత్తి చేస్తున్న తేనెటీగలు.. ఆన్‌లైన్‌లో భారీ డిమాండ్
దిశ, ఫీచర్స్: నార్త్ కరోలినాలోని శాండ్ హిల్స్ (ఇసుక తిన్నెలు) తేనెటీగలు ఊదారంగు తేనెను(purple honey) ఉత్పత్తి చేస్తున్నాయి. దీంతో ప్రపంచంలోనే ఇలాంటి ప్రత్యేకత కలిగిన ఏకైక ప్రదేశంగా గుర్తింపు పొందింది శాండ్ హిల్స్. ‘‘చేదుగా ఉండే కార్బెజోలో హనీ మొదలు, రాబందు తేనెటీగలు ఉత్పత్తి చేసే తేనె వరకు అసాధారణ రకాల తేనెలను ఆడిటీ సెంట్రల్‌లో సంవత్సరాల తరబడిగా ప్రదర్శిస్తున్నారు. కానీ వాటిలో ఏవీ నార్త్ కరోలినాలో మాదిరిగా పర్పుల్ కలర్‌లో ఉండటం లేదు. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా తేనె ఇష్టపడేవారిని, తేనెటీగల పెంపకం దారులను ఆకర్షించడంలో ఇది ముందుంది’ అని నిపుణులు చెప్తున్నారు.
పర్పుల్ కలర్ తేనె సాధారణ రకం (sweeter than the amber kind and apparently) కంటే తియ్యగా ఉంటుంది. తాజాగా రెడిట్‌లో ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ కాగా.. ఇది నిజమా? కాదా? అనే చర్చ మొదలైంది. అయితే నార్త్ కరోలినా ప్రజలకు ఇది ఆశ్చర్యకరమైన విషయం కాదు. ఇక్కడ పర్పుల్ కలర్ తేనె సాధారణమే కానీ పింక్ కలర్ హనీ చాలా అరుదు.
ఎందుకలా ఉంటుంది?
నార్త్ కరోలినాలో తేనె రంగు.. లేత పసుపు నుంచి ముదురు కాషాయం వరకు ఆయా పువ్వుల రకాన్ని బట్టి కూడా ఉంటుంది. అయితే ఊదా తేనె విషయంలో మాత్రం కారణాన్ని ఇంకా సైంటిఫిక్‌గా గుర్తించలేదు. కొందరైతే ఇది బ్లూబెర్రీస్ లేదా హకిల్‌బెర్రీస్ వంటి పండ్లను తేనెటీగలు తినడంవల్ల వస్తుందని భావిస్తుంటారు. అయితే సైంటిస్టులు, తేనెటీగల పెంపకందారులు మాత్రం దీనిని అంగీకరించడం లేదు. తేనెటీగలు బెర్రీలను కొరుక్కుని తినే విధంగా వాటికి దృఢమైన దంతాలు ఉండవని చెప్తున్నారు. మరికొందరు కుడ్జు మొక్క పువ్వుల కారణంగానే అసాధారణ రంగును ఉత్పత్తి చేస్తాయని చెబుతారు.
కెమికల్స్ ప్రభావంవల్లేనా?
నార్త్ కరోలినా స్టేట్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జాన్ ఆంబ్రోస్ ప్రకారం.. పర్పుల్ తేనె తేనెటీగల కడుపులోని ఆమ్లం అండ్ అల్యూమినియం కెమికల్స్ మధ్య జరిగే ప్రతిచర్య ఫలితంగా ఏర్పడవచ్చు. మరో విషయం ఏంటంటే.. నార్త్ కరోలినాలోని తీర ప్రాంతంలోని వివిధ రకాల పువ్వులు మరెక్కడా లేనంత ఎక్కువ అల్యూమినియం పర్సంటేజ్‌ని కలిగి ఉంటాయి. పర్పుల్ కలర్ తేనె ఉత్పత్తి అవడమే దీనికి నిదర్శనంగా కూడా కొందరు పేర్కొంటున్నారు. పర్పుల్ తేనె రుచి చూసిన పలువురు ద్రాక్ష లేదా బెర్రీల మాదిరి టేస్టును కలిగి ఉందని కూడా చెప్తుంటారు.
కానీ “పర్పుల్ తేనె చాలా తియ్యగా ఉంటుంది. తేనెటీగల ద్వారానే ఉత్పత్తి చేయబడుతుంది. దీనికి ఫలవంతమైన అండర్ టోన్ ఉంది” అని తేనెటీగల పెంపకందారుడు డోనాల్డ్ డీస్ చెప్పాడు. ‘‘పర్పుల్ తేనె అనేది అరుదైన ఉత్పత్తి, ఇది సాధారణంగా కాషాయం రకం కంటే ఎక్కువ ధరను కలిగి ఉంటుంది. అయితే ఇది ఇటీవల ఆన్‌లైన్‌లో లభిస్తున్నందున మరింత డిమాండ్ పెరిగింది’’ అని నార్త్ కరోలినా తేనెటీగల పెంపకందారులు పేర్కొంటున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి దీనికి ఆర్డర్‌లు వస్తున్నట్లు వారు తెలిపారు. ఇక అద్భుతమైన రుచి, అందరినీ ఆకట్టుకునే పర్పుల్ కలర్ తేనెను నార్త్ కరోలినా తీర ప్రాంతంలోని తేనెటీగలు మాత్రమే ఎందుకు ఉత్పత్తి చేస్తాయనేది ఇప్పటికీ వీడని మిస్టరీనే.
ఇవి కూడా చదవండి : మనుషులను చంపేస్తున్న పుట్టగొడుగు.. అదే టార్గెట్ (వీడియో)