బీకేర్‌ఫుల్!.. విపరీతంగా దాహం వేస్తుందా? ఈ 5 ప్రమాదకర వ్యాధులు కారణం కావచ్చు..

by Kavitha |
బీకేర్‌ఫుల్!.. విపరీతంగా దాహం వేస్తుందా? ఈ 5 ప్రమాదకర వ్యాధులు కారణం కావచ్చు..
X

దిశ, ఫీచర్స్: సహజంగా శరీరానికి బాగా చెమట పట్టినా లేదా వేడిగా అనిపించినా దాహం తీరడానికి పావు నుంచి అర లీటరు నీరు తాగితే సరిపోతుంది. ముఖ్యంగా ఎండాకాలంలో పదేపదే దాహం వేస్తుంది. అలా అనిపించడం కామన్ కానీ ఎక్కువ నీరు త్రాగిన తర్వాత కూడా పదే పదే దాహంగా అనిపిస్తే మాత్రం డాక్టర్‌ని కంన్సల్ట్ అవ్వడం బెటెర్. చాలా మంది దాహం తీర్చుకోవడానికి అనేక గ్లాసుల నీరు, చల్లటి జ్యూస్, కూల్ డ్రింక్స్ తాగుతారు. కాని వారికి దాహం మాత్రం తీరిపోదు. ఇలాంటి సిట్యువేషన్‌నే ‘పాలీడిప్సియా’(Polydipsia) అంటారు. అయితే ఇలా తరచూ దాహం వేస్తే ప్రమాదకరమని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. దీన్ని నివారించేందుకు వైద్యులను సంప్రదించడం మంచిది. అసలు ఎక్కువగా దాహం వేయడం వెనుక ఉన్న కారణాలు ఏమిటో తెలుసుకుందామా..

డీహైడ్రేషన్: మన బాడీలో వాటర్ కంటెంట్ తక్కువ అయినప్పుడు మనం డీహైడ్రేషన్‌కి గురి అవుతాము. దాని వల్ల ఒకటి లేదా రెండు గ్లాసుల నీరు తాగితే దాహం తీరదు. కాబట్టి అందుకు గాను గొంతును కొద్దికొద్దిగా తడుపుతూ ఉండాలి. అంటే కొంచెం కొంచెం నీరు తాగుతూ ఉండాలి..

పొడి నోరు: చాలా మంది తమ నోటిలో తగినంత లాలాజలం ఉత్పత్తి చేయరు. దీని కారణంగా వారి నోరు పొడిగా అనిపిస్తుంది. పదేపదే నీరు త్రాగినప్పటికీ వారి దాహం తీరదు.

మధుమేహం: డయాబెటిస్ అనేక వ్యాధులకు మూలం.. డయాబెటిస్ రోగుల ప్రధాన సమస్య ఏమిటంటే వారికి పదే పదే నీరు తాగాలనిపిస్తుంది.

ఆహార అలవాట్లు: మీరు జంక్ ఫుడ్ లేదా ఎక్కువ స్పైసీ ఫుడ్ తిన్నా కూడా, పదే పదే దాహం వేయడం సహజం..

రక్తహీనత: శరీరంలో తగినంత బ్లడ్ లేకపోవడాన్ని రక్తహీనత అంటారు. హిమోగ్లోబిన్ లోపం ఉంటే నీరు ఎంత తాగిన కానీ మళ్లీ వెంటనే దాహంగా అనిపిస్తుంది.

పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే దీనిని అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు సంబంధించి ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

Advertisement

Next Story

Most Viewed