అందంగా ఉండాలా.. అయితే బీర్‌తో ఇలా చేయండి!

by Jakkula Samataha |
అందంగా ఉండాలా.. అయితే బీర్‌తో ఇలా చేయండి!
X

దిశ, ఫీచర్స్ : మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం.కానీ ఆ విషయాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. శరీరానికి ప్రమాదకరం అని తెలిసి కూడా మద్యం సేవిస్తున్నారు.ఇక బీర్ అంటే చాలా మందికి ఇష్టం. యూత్ బీర్ తాగడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. మరీ ముఖ్యంగా బీర్ తాగడం వలన గ్లామర్ పెరుగుతుంది అంటారు. అందువలన ఈ మధ్య బ్యూటీ కోసం కొంత మంది అమ్మాయిలు కూడా బీర్ తాగడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

అయితే బీర్ తాగడమే కాదండోయ్, ముఖానికి అప్లై చేసుకోవడం వలన కూడా బోలెడన్నీ ప్రయోజనాలు ఉన్నాయంట. చర్మం నిగనిగ మెరవాలన్నా, అందమైన ముఖం మీ సొంతం కావాలి అంటే ప్రతీ రోజూ బీర్‌ను ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకోవాలంట.ఇలా చేయడం వలన మెరిసే అందం మీ సొంతం అవుతుంది అంటున్నారు నిపుణులు.

ప్రస్తుతం చాలా మంది అమ్మాయిలు మొటిమలు, నల్లటి మచ్చలతో బాధపడుతున్నారు. అలాంటి వారు బీరు‌లో ఆరెంజ్ జ్యూస్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలంట. ఇలా చేసిన ఇరవై నిమిషాల తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే ముఖం నిగ నిగ ఉంటుందంట. అలాగే బీర్‌లో హైపర్‌పిగ్మెంటేషన్‌ను తగ్గించే హైడ్రోక్వినోన్ అనే సమ్మేళనం ఉంటుందంట. అందువలన బీర్‌ను ముఖాని అప్లై చేయడం వలన మొటిమలు, నల్లటి మచ్చలు తగ్గుతాయి అంటున్నారు వైద్యులు.

Advertisement

Next Story