- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మండే ఎండలో కూడా మీరు అందంగా ఉండాలా.. ఈ టిప్స్ ట్రై చేయండి!
దిశ, ఫీచర్స్ : అందంగా ఉండాలని ఎవరు కోరుకోరు. ప్రతి ఒక్కరూ తాము స్పెషల్, అట్రాక్టివ్‌గా ఉండాలి అనుకుంటారు. తమ ఫేస్ నిగారింపుగా ఉండడానికి ఏవేవో క్రీమ్స్ రాస్తూ..తమ అందాన్ని కాపాడుకుంటారు. అయితే వేసవి వచ్చేసింది. ఈ సీజన్‌లో ముఖం డ్రైగా అవుతోంది. కాబట్టి ఎండాకాలంలో వేడి నుంచి మీ అందాన్ని కాపాడుకోవడానికి కొన్ని బ్యూటీ టిప్స్ ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
సమ్మర్ వచ్చిందంటే చాలు దుమ్ము, ధూళి, చెమట వలన చర్మం జిడ్డుగా మారిపోతుంది. అంతే కాకుండా వీటి వలన మొటిమలు రావడం లాంటి సమస్యలు ఎదురవుతాయి. అందువలన ఈ కాలంలో కొన్ని టిప్స్ పాటించడం వలన ఈ సమ్మర్ నుంచి మన అందాన్ని కాపాడుకోవచ్చు.
1. సమ్మర్‌లో అందంగా కనిపించాలంటే బయటకు వెళ్లి వచ్చిన ప్రతీ సారి ఫేస్ వాష్ చేసుకోవాలంట.
2. ఎండాకాలంలో వచ్చే మొటిమలను పొగొట్టుకునేందుకు కీర దోస రసంలో కాస్త నిమ్మరసం, తేనె కలిపి ముఖానికి రోజూ క్లీన్ చేయడం వలన మొటిమలు తగ్గిపోతాయి.
3. సమ్మర్‌కు తగ్గట్లు బ్యూటీ ప్రొడక్ట్స్ చూస్ చేసుకొని వాటిని ప్రతి రోజూ వాడాలి.
4. ఇప్పటి వరకూ సన్ స్క్రీన్ రోజూ రెండు సార్లు రాసుకుంటే, వేసవిలో తప్పకుండా మూడు లేదా నాలుగు సార్లు రాసుకోవాలంట. లేకపోతే ట్యాన్ పిగ్మెంటేషన్ వంటి సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు.
5. ఒక కప్పు సెనగ పిండిలో కాస్త పంచదార, పావు కప్పు నువ్వుల నూనె వేసి ముఖానికి, శరీరానికి రాసుకోవడం వలన చర్మం మిల మిల మెరిసిపోతుందంట.