బేసిక్ ఇన్‌కమ్ ప్రోగ్రామ్.. ప్రతీ నిరాశ్రయుడికి రూ. 9.5 లక్షల సాయం

by Hamsa |   ( Updated:2022-09-20 15:16:42.0  )
బేసిక్ ఇన్‌కమ్ ప్రోగ్రామ్.. ప్రతీ నిరాశ్రయుడికి రూ. 9.5 లక్షల సాయం
X

దిశ, ఫీచర్స్ : అమెరికాలోని డెన్వర్ నగరంలో 140 మందికి పైగా నిరాశ్రయులకు గృహనిర్మాణంలో సాయం చేసేందుకు పైలట్ ప్రోగ్రామ్‌ చేపట్టారు. ఇందులో భాగంగానే వచ్చే ఏడాది ఒక్కొక్కరికి $12,000 (రూ. 9.5 లక్షలు) ఇవ్వనున్నారు. ఈ డెన్వర్ బేసిక్ ఇన్‌కమ్ ప్రాజెక్ట్(DBIP) ఇప్పటికే సిటీ కౌన్సిల్ ఆమోదం పొందగా.. ఇందుకోసం సుమారు $2 మిలియన్లు ఖర్చు చేస్తున్నారు. ఇక ప్రాజెక్ట్‌లో భాగంగా.. షెల్టర్లలో ఉన్న మహిళలు, లింగమార్పిడి, లింగ నిర్ధారణ కాని వ్యక్తులతో పాటు కుటుంబాలకు నేరుగా నగదు సాయం చేయబడుతుంది.

ప్రస్తుతం షెల్టర్ సిస్టమ్‌ను ఉపయోగిస్తున్న అర్హులైన వ్యక్తులకు ఈ కాంట్రాక్ట్ ప్రకారం ఏడాదిపాటు నెలకు $1,000(దాదాపు రూ. 80,000) వరకు అందిస్తారు. ఈ ప్రత్యక్ష నగదు సహాయం ప్రస్తుతం ఆశ్రయాల్లో ఉంటున్న 140కి పైగా మహిళలు, కుటుంబాలు స్థిరమైన గృహాల్లోకి మారేందుకు ఉపయోగపడుతుందని.. తద్వారా ఖాళీ అయిన ఆశ్రయాల్లో మరింత మందికి స్థానం కల్పించవచ్చని మేయర్ మైఖేల్ బి. హాన్‌కాక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రోగ్రామ్ కోసం $2 మిలియన్ల నిధులను అమెరికన్ రెస్క్యూ ప్లాన్ యాక్ట్ నుంచి కేటాయించారు.

ఇక మొదటి దశలో 820 మందికి సేవ చేయడమే లక్ష్యమని ఈ ప్రాజెక్ట్ వ్యవస్థాపకుడు మార్క్ డొనావన్ తెలిపాడు. పైలట్ ప్రోగ్రామ్ అయితే, ఇతర రాష్ట్రాల్లో ఇది ప్రభావవంతంగా ఉందని డొనావన్ చెప్పారు. ఇప్పటికే $7 మిలియన్లకు పైగా సేకరించినట్లు తెలిపిన డొనావన్.. నగరానికి ప్రత్యేకంగా కేటాయించిన $2 మిలియన్లతో అత్యంత అవసరమైన వారికి సాయపడేందుకు హామీనిస్తామని చెప్పారు.

ఇవి కూడా చదవండి : బ్రేవ్ స్పైడర్ మ్యాన్.. 48 అంతస్తుల ఆకాశ హర్మ్యాన్ని సేఫ్టీ లేకుండా..

Advertisement

Next Story