- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Urine: తరచూ మూత్రం వస్తోందా.. అయితే ప్రమాదంలో పడ్డట్లేనంటున్నారు నిపుణులు
దిశ, ఫీచర్స్: మూత్రవిసర్జన చేయడం వల్ల శరీరంలోని వ్యర్థ పదార్థాలు బయటకుపోతాయి. ప్రతిరోజూ 3 నుంచి 7 సార్లు మూత్రం వెళ్లడం సాధారణం. అయితే కొంతమంది రాత్రి పగలు తేడా లేకుండా టాయిలెట్ వెళ్తూ ఉంటారు. ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేస్తుంటారు. అనేక సార్లు టాయిలెట్ వెళ్లాల్సి వస్తుందని పలువురు వాటర్ కూడా తాగడం మానేస్తుంటారు. కానీ వాటర్ తాగకపోతే బాడీ డీహైడ్రేట్ అవుతుందన్న విషయం తెలిసిందే. ఇది ప్రాణాలకే ప్రమాదం. అయితే పదే పదే మూత్ర విసర్జన చేయడం ద్వారా ఈ సమస్యలు ఉండొచ్చని తాజాగా వైద్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
డయాబెటిస్..
తరచూ రెండు నిమిషాలకోసారి టాయిలెట్ వెళ్లినట్లైతే మీకు డయాబెటీస్ ఉన్నట్లేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే బాడీలో షుగర్ లెవల్స్ పెరగడం వల్ల దాని ప్రభావం మూత్రపిండాల మీద పడుతుందట. ఇది టైప్ -2 డయాబెటిస్ ప్రారంభ సంకేతాన్ని సూచిస్తుంది. దీంతో డీహైడ్రేషన్ బారిన పడుతుంటారు.
ప్రెగ్నెన్సీ..
మూత్రం పదే పదే వెళ్లాడానికి మహిళలు గర్భం దాల్చడం ఓ కారణమేనంటున్నారు నిపుణులు. ప్రెగ్నెన్సీ కన్ఫమ్ అయిన ఫస్ట్ వీక్‌లో మూత్రాశయంపై ఒత్తిడి అధికంగా పడుతుందట. దీంతో ప్రెగ్నెన్సీ మహిళలు ఎక్కువసార్లు టాయిలెట్ వెళ్లాల్సి వస్తుందట. ఈ ప్రాబ్లమ్ డెలివరీ అయ్యే వరకు ఉంటుంది. ఇది ప్రతి ఒక్క మహిళ ఫేస్ చేయాల్సిన సర్వసాధారణమైన సమస్య. హార్మోన్లలో మార్పులు జరగడం వల్ల కూడా తరచూ మూత్రం వస్తుంటుంది.
యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లు..
యూటీఐ ప్రాబ్లమ్ ఉంటే హానికరమైన బ్యాక్టీరియా యోనిలోనికి వెళ్తుంది. దీంతో ప్రైవేటు ప్లేస్‌లో నొప్పి, మూత్రంలో చికాకు వస్తుంటుంది. అప్పుడప్పుడు టాయిలెట్‌లో బ్లడ్ కూడా పడుతుంది. సేఫ్ లేని లైంగిక సంబంధాల వల్ల, వాటర్ తక్కువగా తీసుకోవడం వల్ల, బహిరంగ టాయిలెట్స్ యూజ్ చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ తలెత్తే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. అంతేకాకుండా సెక్సువల్లీ ట్రాన్స్మీటెడ్ ఇన్ఫెక్షన్, బ్లాడర్ క్యాన్సర్, ప్రొస్టేట్ పరిమాణం పెరగడం, డయాబెటిస్ వంటి కారణాల వల్ల పదే పదే మూత్ర విసర్జన చేయాలనిపిస్తుంద. కాగాఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటన వైద్యుడ్ని సంప్రదించడం ఉత్తమం.
గమనిక: పై సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇంటర్నెట్ ద్వారా సేకరించబడింది. దీనిని దిశ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే కనుక నిపుణులను సంప్రదించగలరు.