సెల్ఫీ తీసుకుంటున్నారా.. అయితే సమస్యల్లో పడ్డట్టే?

by Hamsa |   ( Updated:2023-04-03 06:13:44.0  )
సెల్ఫీ తీసుకుంటున్నారా.. అయితే సమస్యల్లో పడ్డట్టే?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం చిన్నా పెద్ద సెల్ ఫోన్లకు బానిసలయ్యారు. ఎక్కడికి వెళ్లినా కానీ సెల్ఫీలు తీసుకుంటూ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తుంటారు. చాలా మంది ఏ సందర్భంలో అయినా సెల్ఫీలను ఎక్కువగా తీసుకుంటారు. మరి కొంత మంది ఫేమస్ అయ్యేందుకు ఎంత ప్రమాదకర సమయంలో ఉన్నామని కూడా మర్చిపోయి సెల్ఫీ తీసుకుంటూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. రకరకాల స్టిల్స్ పెట్టి ఎవరికి వారు సెల్ఫీలు దిగుతూ మురిసిపోతుంటారు. అయితే సెల్ఫీ వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువగా సెల్ఫీలు తీసుకోవడం వల్ల మోచేతి నొప్పి వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా రేడియేషన్ ప్రభావం వల్ల చర్మ సమస్యలు వస్తాయి. అలాగే కండరాల ఒత్తిడి, మానసిక ఆరోగ్యం దెబ్బతినడం వంటి ప్రమాదకర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి సెల్ఫీ ఎక్కువగా తీసుకోకపోవడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.

Also Read.. సరిగ్గా 50 సంవత్సరాల క్రితం ఇదే రోజు.. మొట్టమొదటి మొబైల్ ఫోన్ కాల్

14 ఏళ్లలో 4,500 స్మోక్ బ్రేక్స్.. 9 లక్షలు ఫైన్ వేసిన జపనీస్ కంపెనీ

Advertisement

Next Story