మీరు రోజు రెండు లేక మూడు లవంగాలను తింటున్నారా ? అయితే ఇది మీ కోసమే !

by Prasanna |   ( Updated:2022-12-23 14:32:37.0  )
మీరు రోజు రెండు లేక మూడు లవంగాలను తింటున్నారా ? అయితే ఇది మీ కోసమే !
X

దిశ, వెబ్ డెస్క్ : లవంగాలను మసాలా దినుసులుగా మనం ఉపయోగిస్తుంటాం. లవంగాలు ఒక చెట్టు మొగ్గలు. లవంగం ఒక చెట్టు నుంచి పూసిన పువ్వును బాగా ఎండబెడితే లవంగాలు తయారవుతాయి. ఇవి తాజాగా ఉన్నప్పుడు గులాబీ రంగులా ఉంటాయి. మొగ్గలను కోసి ఎండబెడతారు. ముదురు గోధుమ రంగులోకి మారతాయి. మన దేశంలో కూడా లవంగాలను పండిస్తున్నారు. ఈ లవంగాలను వంటల్లో వాడటం వలన మంచి సువాసనలు ఇస్తాయి. వాతావరణంలో జరిగే మార్పుల వచ్చిన ఇవి బాగానే పండుతాయి. అంతే కాకుండా వీటిలో ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. వీటిని ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. లవంగాలను నమలడం వలన ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. లవంగాలలో ఐరన్, కార్బోహైడ్రేట్స్, సోడియం, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. మధుమెహం ఉన్న వారు ఒక గ్లాస్ ఆరు లవంగాలను వేసి నీటిలో బాగా మరిగించి , వడకట్టి ఆ కాషాయాన్ని పరగడుపున తాగుతూ ఉంటె కొన్ని రోజుల్లోనే మీకు తేడా కనిపిస్తుంది. ఎముకలు ఆరోగ్యంగా , బలంగా ఉండటానికి వీటిని ఉపయోగిస్తారు.

READ MORE

పుస్తకమే సర్వస్వం.. ఆధునిక కాలంలోనూ తగ్గని ఆదరణ

Advertisement

Next Story

Most Viewed