- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీపీ ఉందని సాల్ట్ తక్కువగా తింటున్నారా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే!
దిశ, ఫీచర్స్: ఈ రోజుల్లో చాలామంది అధిక బీపి సమస్యతో బాధపడుతున్నారు. ఆరోగ్య విషయంలో చాలామందిని ఉప్పు బాధిస్తుంది. శరీరంలో సోడియం పెరగడానికి ఉప్పు బాగా పనిచేస్తుంది. రక్తంలో సోడియం తక్కువగా ఉండడం వల్ల హైపోనట్రేమియా వస్తుంది. హైబీపీ ఉన్న వాళ్లు అధిక సోడియంను తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, సాల్ట్ వాడకం పెరిగితే, అధిక రక్తపోటు, గుండె జబ్బులు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలా అని తక్కువగా కూడా ఉప్పు తినడం ప్రమాదమేనంటున్నారు. ఎందుకంటే ఇది ఎలక్ట్రోలైట్‌లలో పుష్కలంగా ఉంటుంది. ఉప్పు లేకుండా శరీరం, మెదడు సరిగా పనిచేయలేవు. ఉప్పు వినియోగం తగ్గిస్తే గుండె, మూత్రపింగడాల పనితీరుపై ప్రతికూల ప్రభావంను చూపుతుంది. అసలు ఉప్పు వాడకంను తగ్గిస్తే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇక్కడ చదివేయండి.
అధిక కొలెస్ట్రాల్: శరీరానికి తగినంత ఉప్పు లేకపోతే చెడు కొలెస్ట్రాల్ (LDL), ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలు పెరుగుతాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
గుండె, కిడ్నీ సమస్యలు: తక్కువ సోడియం లెవల్స్ గుండె ఆరోగ్యానికి హానిచేస్తుంది. అంతేకాకుండా ఉప్పు వాడకంను తగ్గిస్తే, మూత్రపిండాల పనితీనుపై ప్రభావం చూపుతుంది.
మానసిక ఆరోగ్యం: రక్తంలో సోడియం స్థాయిలు లేకపోవడం వల్ల మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. దీని వల్ల ఆందోళన, ఒత్తిడి, నరాల సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా కండరాల తిమ్మిరి, ఆయాసం, తలనొప్పి వంటి సమస్యలకు కారణం కావచ్చు.
ఉప్పులో ఉండే సోడియం శరీరం సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది. సోడియం నాడీ, మెదడు పనితీరును మెరుగ్గా ఉంచుతుంది. బలహీనత, అలసట, మైకం వంటి లక్షణాలు, శరీరంలో సోడియం తక్కువగా ఉన్నప్పుడు అనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితి పదే పదే వస్తూ తీవ్రమైతే..కోమా లేదా మూర్చ వంటి సమస్యకు కారణం అవుతుంది. సాల్ట్ సెన్సిటివ్ అనేది హైపర్‌టెన్షన్ ఉన్న వ్యక్తులు, ఊబకాయం, మూత్రపిండాల సమస్యలు ఉన్నవారిలో కనిపిస్తుంది. ఇలాంటి వారు ఉప్పుని మితంగా వాడడం మంచిది. అలా అని పూర్తిగా ఉప్పు తినడం తగ్గించకూడదు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) నివేదిక ప్రకారం..సోడియంను పెద్దలు అయితే 2000mg కంటే తక్కువగా తీసుకోవాలి. అంటే రోజుకు ప్రతి వ్యక్తి 5 గ్రాముల ఉప్పును తినాలి. దీంతో, సోడియం లోపాన్ని సులభంగా తగ్గించుకోవచ్చు. ఈ సరైన పరిమాణం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే ఉప్పును ఎక్కువగా తీసుకోవడం మానుకోవాలి. లేకుండా అధిక రక్తపోటుకు కారణమవుతుంది.
Read More..
షుగర్ లెవల్స్ పెరగాడానికి ఒత్తిడి కారణమా..?