- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
బ్రేక్‌ఫాస్ట్ టైంలో బ్రెడ్ తింటున్నారా.. పెద్దపేగు క్యాన్సర్ తప్పదంటున్న నిపుణులు!
దిశ, ఫీచర్స్: పెద్దపేగులో కనిపించే అతి పెద్ద సమస్య క్యాన్సర్. ఈ వ్యాధితో ప్రతి సంవత్సరం వేల మంది చనిపోతున్నారు. పెద్ద పేగు క్యాన్సర్ యొక్క అత్యంత సాధారణ లక్షణాల్లో మలబద్ధకం ఒకటి. విరేచనాలు, మలంలో రక్తం, సడన్‌గా బరువు తగ్గడం, రక్తహీనత, వికారం, వాంతులు, ఎముకలలో తీవ్రమైన నొప్పి, పగుళ్లు, మలబద్ధకం, ఊపిరితిత్తుల్లో శ్వాస ఆడకపోవడం, దగ్గు, ఛాతీ నొప్పి, అలసట భావన, అరచేతులు, పాదాల వాపు, కామెర్లు, గందరగోళంగా అనిపించడం, రీకాల్ చేయడంలో ఇబ్బంది, తరచుగా తలనొప్పి లాంటివి పెద్దపేగు లక్షణాలు.
ఈ క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించి సరైన ట్రీట్‌మెంట్స్ తీసుకున్నట్లైతే నయమవుతుందని నిపుణులు చెబుతున్నారు. చికిత్సతో పాటు ఆహారం, జీవన శైలిలో మార్పులు కూడా అవసరమంటున్నారు. ఫైబర్, మెగ్నీషియం, కాల్షియం, భాస్వరం, మాంగనీస్ వంటి ఖనిజాలు శరీరానికి తగింతగా అందిస్తే పెద్దపేగు క్యాన్సర్‌తో పోరాడగలవు. కాగా న్యూట్రీషియన్ రిచ్ ఫుడ్స్ (కూరగాయలు, వాల్ నట్స్, వెల్లుల్లి, పెరుగు) వంటివి ఆహారంలో భాగం చేసుకుంటే మేలని నిపుణులు సూచిస్తున్నారు.
అయితే ప్రతి రోజూ మార్నింగ్ సమయంలో బ్రేక్ ఫాస్ట్ కోసం చాలా మంది వైట్ బ్రెడ్ తింటారు. ఆఫీసులో మధ్యాహ్నం టిఫిన్ లేదా డిన్నర్‌లో బ్రెడ్ తింటుంటారు. కాగా ఇలాంటి వారు పెద్దపేగు క్యాన్సర్ బారిన పడే అవకాశముందని తాజాగా నిపుణులు వెల్లడించారు. ముఖ్యంగా మద్యం తాగేవారు.. వైట్ బ్రెడ్‌ను ఉదయం పూట తింటే పెద్దపేగు క్యాన్సర్ బారిన పడతారంటున్నారు.
కాగా బ్రేక్ ఫాస్ట్ సమయంలో వైట్ బ్రెడ్ తినకుండా ఉండటం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు తెలిపారు. అలాగే పెద్దపేగు క్యాన్సర్ లింగాన్ని బట్టి మారుతుందని, ఈ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడే కారకాలు స్త్రీలలో కంటే పురుషుల శరీరంలోనే ఎక్కువగా ఉంటాయని వెల్లడించారు. ఈ క్యాన్సర్‌కు మరొక కారణం వంశపారపర్యంగా వస్తుందని పేర్కొన్నారు.
Read More..
లక్షలు, కోట్లు కుమ్మరించాల్సిన అవసరం లేదు.. వంద రూపాయలతో క్యాన్సర్‌కు చెక్