నీటిని వేడి చేసి తాగుతున్నారా..? అయితే ఇది తెలుసుకోండి

by Kalyani |
నీటిని వేడి చేసి తాగుతున్నారా..? అయితే ఇది తెలుసుకోండి
X

దిశ, వెబ్ డెస్క్: మన ఆరోగ్యం బాగుండాలంటే స్వచ్ఛమైన నీరు తీసుకోవడం చాలా ముఖ్యం. ఏ ఆహారం తినాలన్నా అది నీటితో ముడిపడి ఉంటుంది. తాగేనీరు కలుషితం లేకుండా చూసుకోవాలి. ప్రస్తుతం వర్షాకాలం వచ్చింది. ఈ సీజన్ లో నీరు కలుషితం కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కలుషిత నీరు సేవించడం ద్వారా రకరకాల రోగాలు వస్తాయి. అందుకే నీటిని వేడి చేసుకొని తాగాలని డాక్టర్లు సూచిస్తుంటారు. అయితే ఒకసారి మరిగించి చల్లార్చిన నీటిని కొంతమంది పదే పదే మరిగించి తాగుతుంటారు.

ఇది ఏమాత్రం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల నీటిలో ఉండే ప్రయోజనకరమైన నైట్రేట్లు హానికరమైన టాక్సిన్ గా మారి క్యాన్సర్, లుకేమియా, లింఫోమా వంటి వ్యాధులకు కారణమవుతాయని చెబుతున్నారు. అందుకే నీటిని ఒకేసారి వేడి చేసి చల్లార్చి తాగితే ఎలాంటి ప్రమాదం ఉండదని వైద్యులు సూచిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed