- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసిన జంటలే త్వరగా విడాకులు తీసుకుంటున్నారా.. సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడి !
దిశ, ఫీచర్స్ : ఈ మధ్య కాలంలో చాలా మంది కోట్లు ఖర్చు పెట్టి పెళ్ళీలు జరిపిస్తున్నారు. ఎంత ఖర్చు అయినా సరే వెనకాడకుండా, వివాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. ఎంత ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తారో, అలాంటి వారే చాలా త్వరగా విడాకులు తీసుకొని విడిపోతున్నారంట.
తమ బిడ్డకు లేదా, కొడుకు పెళ్లి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి చేసి తల్లిదండ్రులు తమ ప్రేమను వ్యక్త పరుస్తుంటారు. కానీ చివరకు అదే ముప్పుగా మారుతుంది. పెళ్లి ఖర్చులకు, విడాకులకు మధ్య లోతైన సంబంధం ఉంది అంటున్నారు, పరిశోధకులు. కొందరు గొప్పలకు పోయి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి చేస్తే అది నవ దంపతులకు మానసిక ఇబ్బందులను తీసుకొస్తుందంట. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు చాలా మంది పెళ్లి ఖర్చులకు వెనకాడటం లేదు, దీంతో గొప్పగా పెళ్లి చేసుకొని తర్వాత బంధం నచ్చలేదు, అని చెప్తే ఏమనుకుంటారో, దానిని ప్రజలు ఏవిధంగా అర్థం చేసుకుంటారో అనే భయంతో, తమ మధ్య ఉన్న సమస్యలను బయటకు చెప్పలేక బంధాన్ని కొనసాగిస్తూ వచ్చి చివరకు, ఆ సమస్య పెరిగిపోయి విడాకుల వరకు వెళ్తున్నారు. కొంత మంది ఇంత డబ్బు ఖర్చు పెట్టి పెళ్ళి చేసుకొని విడిపోతే ఎలా అని ఆలోచిస్తూ మానసికంగా కూడా కుంగిపోతున్నారంటున్నారు నిపుణులు. అందుకే పెళ్లి ఖర్చుల గురించి ఎక్కువ ఆలోచించకుండా వివాహం చేసే జంటల మధ్య బంధం బలపడేలా చేయాలంట. పెళ్లి తర్వాత వారు అన్ని విషయాలు పంచుకునే ఫ్రీడమ్ కల్పించడం కోసం కోట్లు ఖర్చు పెట్టి హనీమూన్ ప్లాన్ చేయడం లాంటివి చేయాలంట. కానీ పెళ్లి కోసమే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టకూడదంట. ఎందుకంటే? తాజాగా పరిశోధకులు 3000 మందిని సర్వే చేయగా, అందులో ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి పెళ్లి చేసిన వారికే త్వరగా విడాకులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తేలిందంట.1.3 రేట్లు తక్కువ ఖర్చు పెట్టిన వారితో పోలిస్తే ఎక్కువ ఖర్చు పెట్టిన వారు విడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉన్నట్లు తేలిందంట. అందువలన డబ్బు ఖర్చు పెట్టి ఘనంగా పెళ్లి చేయడం కాకుండా, బలమైన బంధంపై దృష్టి పెట్టాలని అంటున్నారు నిపుణులు.