- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏప్రిల్-10: అంతర్జాతీయ తోబుట్టువుల దినోత్సవం
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం సమాజంలో బంధం అనే పదానికి సంకెళ్లు వేసి ఎవరు బిజీ లైఫ్‌లో వాళ్లు బతుకుతున్నారు. కానీ, ఒక వ్యక్తి జీవితంలో తోబుట్టువుల ప్రాముఖ్యత ఎంత ముఖ్యమో తెలిపేందుకే ఈ రోజు (ఏప్రిల్-10)న అంతర్జాతీయ తోబుట్టువుల దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రతి ఒక్కరి లైఫ్‌లో సోదరులు, సోదరీమణులు ఉంటారు. వారితో గొడవ పడో, తగాదాలు వచ్చో విడిపోతారు. కానీ వారి ప్రాముఖ్యతను తెలుసుకుని వారితో సన్నిహితంగా ఉండండి. ఎందుకంటే మీ తోబుట్టువులే మీకు మంచి స్నేహితులు. కొన్ని కొన్ని సార్లు వాళ్లు మీకు శత్రువులుగా కనిపిస్తారు.. కానీ వారిని ద్వేషిస్తూ వాళ్లకు మీరు దూరంగా ఉండలేరు. కాబట్టి.. ప్రేమించి ప్రేమగా దగ్గరవ్వండి.
తోబుట్టువుల దినోత్సవం చరిత్ర..
మొట్ట మొదటి సారి తోబుట్టువుల దినోత్సవాన్ని న్యూయార్క్‌కు చెందిన క్లాడియా ఎవర్ట్ ప్రారంభించారు. ఆమె తన చిన్న వయసులో సోదరుడిని, సోదరిని పోగొట్టుకుంది. దీంతో క్లాడియా ఓ వ్యక్తి జీవితంలో తోబుట్టువుల ప్రాముఖ్యతను గ్రహించి 1995 లో ఆమె ఈ దినాన్ని స్థాపించారు. అంతే కాకుండా ఆమె తన తోబుట్టువుల జ్ఞాపకార్థంగా సిబ్లింగ్స్ డే పౌండేషన్‌ను స్థాపించారు.
Also Read..