ప్రేమికుల వారం మాదిరిగానే యాంటీ-వాలెంటెన్స్ వీక్

by Mahesh |   ( Updated:2023-02-14 04:18:56.0  )
ప్రేమికుల వారం మాదిరిగానే యాంటీ-వాలెంటెన్స్ వీక్
X

దిశ, ఫీచర్స్: సాధారణంగా ప్రేమ అంటే పగ ఉన్నవారు లేకపోరు. వారి జీవితంలోని పాఠాలే గుణపాఠాలుగా మారి లవ్ అంటే యాంటీ స్టార్ట్ అవుతుంది. ఆ పేరు చెప్తేనే కంపరం వచ్చేస్తుంది. అలాంటి వారి కోసమే 'Anti-Valentines Day' సెలబ్రేషన్స్. కాగా వారం రోజుల పాటు జరుపుకునే ఈ ఉత్సవాలను.. వాలెంటైన్స్ డే వీక్ మాదిరిగానే ఒక్కో రోజు ఒక్కో విధంగా యాంటీ-వాలెంటైన్స్ డే వీక్‌గా జరుపుకుంటారు. వినడానికి కొంచెం కొత్తగా అనిపిస్తున్న ఇందుకు సంబంధించిన విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

స్లాప్ డే - ఫిబ్రవరి 15

స్లాప్ డే అనేది యాంటీ-వాలెంటైన్స్ వీక్‌లో మొదటి రోజు. వాలెంటైన్స్ డే తర్వాత వెంటనే వచ్చే రోజు(ఫిబ్రవరి 15)న జరుపుకుంటారు. తమను మోసం చేసిన, హృదయాన్ని గాయపరిచిన ఎక్స్‌లవర్స్‌ను చెంప దెబ్బ కొట్టాలనుకునే వ్యక్తుల కోసం ఈ రోజు డిజైన్ చేయబడింది. అయితే.. మీరు నిజంగా వెళ్లి వారిని చెంపదెబ్బ కొట్టాలనేది దీని ఉద్దేశ్యం కాదు. బదులుగా మీ లైఫ్‌లో సక్సెస్‌ఫుల్‌గా ఉంటూ.. మాజీ లవర్‌తో ఉన్న జ్ఞాపక అవశేషాలను చెరిపేస్తూ, జీవితంలో ముందుకు సాగండి.

కిక్ డే - ఫిబ్రవరి 16

కిక్ డే ఫిబ్రవరి 16న వస్తుంది. యాంటీ-వాలెంటైన్స్ వీక్‌లో ఇది రెండవ రోజు. ఈ రోజున మీ ఎక్స్‌ లవర్ కారణంగా మీ జీవితంలో మిగిలిపోయిన అన్ని ప్రతికూలతలను తొలగించడానికి సిద్ధంగా ఉండండి. మీరు అన్ని ఆనందాలకు అర్హులు అని, వాటినన్నింటిని ఆస్వాదించడం మీ లక్ష్యమని గుర్తుంచుకోండి. అంతేకాదు మీ ఎక్స్ నుంచి అందుకున్న బహుమతులు, జ్ఞాపకాలను వదులుకునే ప్రయత్నం చేయండి.

పెర్ఫ్యూమ్ డే - ఫిబ్రవరి 17

పెర్ఫ్యూమ్ డే అనేది యాంటీ-వాలెంటైన్స్ డేలో మూడవ రోజు. మిమ్మల్ని మీరు గొప్పవారిగా యాక్సెప్ట్ చేయండి. గతం తాలుకూ జ్ఞాపకాలను వదిలేస్తూ.. బ్రహ్మాండమైన పెర్ఫ్యూమ్ స్మెల్‌తో సెలబ్రేట్ చేసుకోండి. మంచి అనుభూతిని పొందుతూ మిమ్మల్ని మీరు బాగా చూసుకోండి.

ఫ్లర్ట్ డే - ఫిబ్రవరి 18

యాంటీ-వాలెంటైన్స్ వీక్‌లో నాల్గవ రోజు ఫ్లర్ట్ డే. దీన్ని ఫిబ్రవరి 18న సెలబ్రేట్ చేసుకుంటారు. మీరు ఎవరి మీదైనా చిరకాల క్రష్ కలిగి ఉన్నట్లయితే.. ఈ రోజు మాట్లాడి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. అతను/ఆమెతో మంచి సమయాన్ని గడపండి. ఇది మీ అవకాశం. కాబట్టి సరికొత్త అనుభవాన్ని పొందేందుకు, సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించండి.

కన్ఫెషన్ డే - ఫిబ్రవరి 19

కన్ఫెషన్ డే అనేది యాంటీ-వాలెంటైన్స్ వీక్‌లో ఐదవ రోజు. మీ ప్రేమ గురించి చెప్పేందుకు, మీ భాగస్వామి మీద భావాలను వ్యక్తీకరించేందుకు సరైన అవకాశం. మీరు గతంలో చేసిన తప్పులను అంగీకరించేందుకు, క్షమించేందుకు, క్షమించబడేందుకు సరైన రోజు.

మిస్సింగ్ డే - ఫిబ్రవరి 20

మిస్సింగ్ డే.. మీరు ఇష్టపడే వారిని ఎంత మిస్ అవుతున్నారని చెప్పడానికి ఇది మంచి రోజు. మీరు మీ ఎక్స్‌కు మెసేజ్ పెట్టండి. మీరు ఎలా ఉన్నారో చెప్పండి? కుశల ప్రశ్నలు అడగండి. ఏదైనా సహాయం కావాలంటే చేయండి, అడగండి. అంతేకానీ మీరు తీసుకున్న ఈ నిర్ణయానికి చింతించకండి.

బ్రేకప్ డే - ఫిబ్రవరి 21

ఫిబ్రవరి 21న వచ్చే బ్రేకప్ డేతో యాంటీ-వాలెంటెన్స్ వీక్ ముగుస్తుంది. మీరు విషపూరిత సంబంధాన్ని కలిగి ఉండటం లేదా మీరు స్పార్క్‌ని కోల్పోయిన వారితో అలసిపోయినట్లయితే, బ్యాండ్-ఎయిడ్‌ను తీసివేయడానికి మరియు ఎంచుకోవడానికి బ్రేకప్ డే సరైన అవకాశం.

ఇవి కూడా చదవండి : Love After Divorce.. లైఫ్‌ను రీస్టార్ట్ చేయడంలో ఆలస్యమెందుకు?

Advertisement

Next Story