Another Earth : అక్కడ మనుషులు వంద కాదు.. ఏకంగా 2000 సంవత్సరాలు జీవిస్తారు!

by Javid Pasha |
Another Earth : అక్కడ మనుషులు వంద కాదు.. ఏకంగా 2000 సంవత్సరాలు జీవిస్తారు!
X

దిశ, ఫీచర్స్: మనుషులు ఎంత కాలం జీవిస్తారు? ఒకప్పుడైతే వందేండ్లు జీవిస్తారని చెప్పేవారు. కానీ ప్రస్తుతం 65 ఏండ్లు దాటిన తర్వాత సరిగ్గా ఇంతకాలం జీవిస్తారనే గ్యారెంటీ ఏదీ ఇవ్వలేమని వైద్య నిపుణులే చెప్తుంటారు. అలాంటిది ఒక దగ్గర మాత్రం వంద, రెండు వందలు కాదు. ఏకంగా రెండువేల ఏండ్లు జీవించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు? ఇంతకీ అదెక్కడ? ఎలా సాధ్యమో ఇప్పుడు చూద్దాం.

అంతరిక్షమంటేనే అందరికీ ఆసక్తి.. సాధారణంగా అయితే మిణుకు మిణుకు మనే నక్షత్రాలు, చల్లని వెన్నెల, నిర్మలమైన ఆకాశం వంటివి చూడముచ్చగా ఉంటాయి. ఇక పరిశోధనల పరంగా చూసినా నాసా, ఇస్రోలకు చెందిన శాస్త్రవేత్తలు ఇప్పటికే అనేక విషయాలను గనుగొన్నారు. అయినప్పటికీ అంతుచిక్కని రహస్యాలు అంతరిక్షంలో, ఈ విశ్వంలో ఇంకెన్నో ఉన్నాయని చెప్తున్నారు. అలాంటి వాటిలో ఓ అద్భుతమైన గ్రహం కూడా ఉందని, ఇక్కడ మనుషులు 2000 సంవత్సరాలు జీవించే అవకాశాలు ఉన్నాయని పరిశోధకులు అంటున్నారు.

ఈ భూమి మీద కాకుండా ఇతర గ్రహాలపై జీవించే అవకాశాలపై నింతర పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. చంద్రుడిపై ఇప్పుడు కాకపోయినా, ఏదో ఒకరోజు జీవించే వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయని పేర్కొంటున్న శాస్త్రవేత్తలు, భూమి, చంద్రుడు కాకుండా ఇంకా ఏయే గ్రహాలపై నివసించే చాన్స్ ఉందో కూడా అన్వేషణలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల భూమికి 31 కాంతి సంవత్సరాల దూరంలో మనుషులు జీవించగలిగేందుకు అనువైన ఒక గ్రాహం ఉన్నట్లు సైంటిస్టులు కనుగొన్నారు. రెడ్ ప్లానెట్ చుట్టూ పరిభ్రమిస్తున్న ఈ కొత్త ప్లానెట్‌కు ‘వోల్ఫ్ 106 బి’ అని పేరు పెట్టారు. కాగా ఇది భూమికంటే రెట్టింపు సైజులో, సూర్యుడికంటే కూడా మూడు రెట్లు చిన్న సైజులో ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అయితే భూమిపై ఉన్నట్లే దీనిపై ఆక్సిజన్, నీరు కూడా ఉందంటున్నారు. ఇక ఈ కొత్త గ్రహం సూర్యుడి చుట్టూ 16 రోజుల్లోనే తన పరిభ్రమణాన్ని పూర్తిచేస్తుందని, దీని కారణంగానే ఇక్కడికి మనుషులు వెళ్లి నివసించగలిగితే గనుక.. సుమారు 2000 సంవత్సరాలు జీవించగలుగుతారని పరిశోధకులు అంటున్నారు. అయితే అది ఎలా సాధ్యం చేయాలనే అంశాలపై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

Read More..

నెట్‌లో మీరేం చేస్తున్నారో మాకు తెలుసు.. 24 గంటల్లో అరెస్ట్ వారెంట్ జారీ చేస్తాం!


Advertisement

Next Story

Most Viewed