అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ హనీమూన్ విల్లా.. గోల్డ్, డైమండ్స్‌తో కళ్లు చెదిరిపోయే డెకరేషన్(వీడియో)

by Sujitha Rachapalli |   ( Updated:2024-07-17 12:38:48.0  )
అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ హనీమూన్ విల్లా.. గోల్డ్, డైమండ్స్‌తో కళ్లు చెదిరిపోయే డెకరేషన్(వీడియో)
X

దిశ, ఫీచర్స్: ప్రజెంట్ ఎక్కడ చూసినా అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ పెళ్లి గురించే చర్చ జరుగుతుంది. జూలై 12న జరిగిన వివాహానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తారలు విచ్చేయగా... పేదలకు దాదాపు 40 రోజుల పాటు అన్నదాన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇప్పటికే ప్రతిరోజూ మూడుపూటలా పంచభక్ష పరమాన్నాలు వడ్డిస్తున్నారు కూడా. మరోవైపు పెళ్లికి ముందే సామూహిక వివాహాలు జరిపించి మరీ విలువైన వస్తువులు, వెండి, బంగారం కానుకగా ఇచ్చారు. ఇక ఇదిలా అంటే ప్రస్తుతం అంబానీ ఫ్యామిలీ లండన్ బయలుదేరిన విషయం తెలిసిందే. కాగా అక్కడే గ్రాండ్ గా రిసెప్షన్ ప్లాన్ చేసింది. ఇక్కడికి వచ్చాక మళ్లీ సెలబ్రిటీలకు ట్రీట్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.

అయితే ఇప్పటికే చిన్న కొడుకు అనంత్ కు నీతా అంబానీ వెయ్యి కోట్ల విలువైన విల్లా బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇందులోనే హనీమూన్ ప్లాన్ చేసినట్లు సమాచారం. కాగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. బంగారం, వజ్రాలతో డెకరేట్ చేసిన క్లిప్పింగ్స్ చూసి షాక్ అవుతున్నారు జనాలు. మరీ ఇంత కాస్ట్లీగా బతుకుతారా అని చర్చించుకుంటున్నారు. అయితే ఇదంతా AI మహిమ అని.. నిజం కాదని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Advertisement

Next Story