బంగారం, వెండితో అనంత్ అంబానీ వెడ్డింగ్ కార్డ్.. దీని ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

by Jakkula Samataha |
బంగారం, వెండితో అనంత్ అంబానీ వెడ్డింగ్ కార్డ్.. దీని ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం ఎక్కడ చూసినా అనంత్ అంబానీ పెళ్లి వేడుకకు సంబంధించిన ముచ్చట్లే వినిపిస్తున్నాయి. అపర కుబేరుడు అంబానీ తన కొడుకు పెళ్లి వేడుకల కోసం కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఊహకందని విధంగా పెళ్లి ఏర్పాట్లు చేస్తూ ఔరా అనిపిస్తున్నాడు. తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ఇప్పుడు అందరూ ఈ వెడ్డింగ్ కార్డు గురించి ముచ్చటిస్తున్నారు. ఎందుకంటే దీని ధర ఆ రేంజ్‌లో ఉంది.

అనంత్ అంబానీ , రాధికల వివాహం జులై 12న జరగనుంది. ఇప్పటికే ఫ్రీ వెడ్డింగ్ వేడుక చాలా గ్రాండ్‌గా చేసిన విషయం తెలిసిందే. అయితే పెళ్లి దగ్గర పడుతుండటంతో, అంబానీ ఫ్యామిలీ ఓ స్పెషల్ వెడ్డిం కార్డును తయారు చేయించారు. దాని ధర ఏకంగా ఆరు నుంచి ఏడు లక్షల వరకు ఉంటుందని సమాచారం. అంతే కాకుండా ఈ కార్డు లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయంట. ఈ వెడ్డింగ్ కార్డ్‌ను అంబానీ ఫ్యామిలీ తమ ఆలయం ఆకారంలో తయారు చేయించారు. కార్డులో ఆలయాన్ని వెండితో తయారు చేయించి, బంగారు విగ్రహాలు ఏర్పాటు చేశారు. అంతే కాకుండా, కార్డు ఓపెన్ చేయగానే చతుర్భుజి రూపంలో విష్ణుమూర్తి ఫోటో దర్శనమిస్తోంది. అలాగే కార్డు తెరిచేటప్పుడు వేద మంత్రాల బాణి వినిపిస్తుందంట. అంతే కాకుండా కార్డు లోపల ఓ సిల్వర్ బాక్స్ పెట్టి ఉంది. అందులో ఏ కార్యక్రమాలు ఏ తేదీలో నిర్వహిస్తున్నామని తెలిపే కొన్ని ఆహ్వాన పత్రికలు ఉండనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ కార్డు అందరినీ ఆకట్టుకుంటుంది.

Advertisement

Next Story

Most Viewed