ఆవులింతతో అద్భుతం.. 107 భయంకరమైన డెసిబెల్ త్రేన్పులతో వరల్డ్ రికార్డ్ సాధించిన మహిళ

by samatah |   ( Updated:2023-09-01 15:55:14.0  )
ఆవులింతతో అద్భుతం.. 107 భయంకరమైన డెసిబెల్ త్రేన్పులతో వరల్డ్ రికార్డ్ సాధించిన మహిళ
X

దిశ, ఫీచర్స్ : బర్ప్ అనే మాట మీరెప్పుడైనా విన్నారా? తెలుగులో త్రేన్పు లేదా ఆవులింత అని కూడా అంటారు. ఇప్పుడు దీని గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోందంటే.. ఒక అమెరికన్ మహిళ ఇటీవల 107.3 డెసిబెల్స్‌ కలిగిన వాయిస్‌తో అత్యంత బిగ్గరగా బర్ప్ చేయడంతో వరల్డ్ గిన్నిస్ రికార్డును సాధించింది. అంతుకు ముందు 2009లో ఇటలీకి చెందిన ఎలిసా కాగ్నోని అనే మహిళ 107 డెసిబెల్ బెల్చ్‌ బర్ప్‌ను నిర్వహించి అత్యంత బిగ్గరగా త్రేన్పులు చేసిన వ్యక్తిగా గిన్నిస్ రికార్డు సాధించింది. అప్పట్లో ఇది అద్భుతమైన విజయం. కానీ ఇప్పుడు అమెరికన్ మేరీల్యాండ్‌కు చెందిన కింబెర్లి ‘కిమికోలా’ అనే యువతి తన బర్పింగ్ కళతో ఆ రికార్డును బద్దలు కొట్టింది.

ఇటీవల IHeartRadioలోని ‘డెడ్ రూమ్’ని సందర్శించిన కింబెర్లి, అక్కడ కాగ్నోని నెలకొల్పిన గత గిన్నిస్ రికార్డును 0.3 డెసిబెల్స్ తేడాతో అధిగమించేందుకు భయంకరమైన శబ్దంతో ఆవులిస్తూ గిన్నిస్ రికార్డు సృష్టించింది. బర్ప్ కళలో ఏదో ఒకరోజు ప్రపంచ రికార్డు సాధించాలనే కోరికతో తను అప్పుడప్పుడు త్రేన్పులను ప్రాక్టీస్ చేశానని కింబెర్లి కిమికోలా వెల్లడించింది. ఈ చారిత్రాత్మక ప్రయత్నానికి ముందు తాను బ్రేక్‌ఫాస్ట్ చేయడం, కాఫీ అండ్ బీర్ తాగడం ద్వారా తన బాడీని అత్యంత శబ్దం వచ్చే త్రేన్పులకోసం సిద్ధం చేసుకున్నట్లు పేర్కొన్నది. గిన్నిస్ రికార్డు నిపుణులతో మాట్లాడుతూ.. తాను చిన్నప్పటి నుంచి గట్టిగా ఆవులించగలిగే అలవాటును కలిగి ఉన్నట్లు చెప్పుకొచ్చింది కింబెర్లి. తన బర్ప్ శబ్దాన్ని విని ఒక్కోసారి కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురయ్యేవారని, కొన్నేండ్ల తర్వత దానిని వినడానికి వారు అలవాటు పడ్డారని తెలిపింది. స్పైసీ ఫుడ్స్, సోడా, ఆల్కహాల్, కొద్దిపాటి నీరు త్రేన్పులు తెప్పించడంలో తనకు సహాయపడినట్లు స్పష్టం చేసింది.

Read More..

కోల్పోయిన ఆర్గాన్స్‌ను రీ ప్రొడక్ట్ చేస్తున్న ఓషియన్ స్పైడర్స్.. మానవ చికిత్సకు వర్తిస్తుందా?

Advertisement

Next Story

Most Viewed