ఈ విషయం తెలిస్తే.. ఎండిపోయిన నిమ్మకాయలను అస్సలే బయటపడేయరు?

by samatah |   ( Updated:2023-06-29 06:14:16.0  )
ఈ విషయం తెలిస్తే.. ఎండిపోయిన నిమ్మకాయలను అస్సలే బయటపడేయరు?
X

దిశ, వెబ్‌డెస్క్ : ఎవరింట్లో నైనా నిమ్మకాయలు ఉండటం చాలా కామన్. మనం మార్కెట్లోకి వెళ్లినప్పుడు తప్పని సరిగా నిమ్మకాయలను కొని తీసుకొచ్చి ఫ్రిడ్జ్‌లో పెడుతుంటాం. అయితే నిమ్మకాయలతో ఎలాంటి యూజ్ లేకపోతే అవి అలాగే ఉండి ఎండిపోతుంటాయి. ఇక వాటితో ఏం పనిలేదని వాటిని బయట పడేస్తుంటాం. కానీ ఎండిపోయిన నిమ్మకాలతో చేసే అద్భుతమైన చిట్కాలు చూస్తే మీరు ఇంకెప్పుడు, వాటిని బయట పాడేయరు.

మురికిగా ఉన్న చాపింగ్ బోర్డ్‌ ను శుభ్రం చేయటానికి ఎండిపోయిన నిమ్మకాయలను ఉపయోగించవచ్చు. దీని కోసం చాపింగ్ బోర్డ్‌ మీద కొంచెం ఉప్పు జల్లి నిమ్మకాయని సగానికి కట్ చేసి ఆ నిమ్మ చెక్కతో రుద్దాలి. దాంతో చాపింగ్ బోర్డ్‌ చాలా క్లీన్ గా మారుతుంది.

వంటగదిలో చాలా రోజులుగా అలా పక్కన పెట్టేసిన వస్తువులు జిడ్డు పట్టేస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో నిమ్మకాయను సగానికి కట్ చేసి ఆ పాత్రపై రుద్ది శుభ్రంగా కడిగితే జిడ్డు చాలా సులభంగా తొలగిపోతుంది.

Read More: పొరపాటున కూడా తొలి ఏకాదశి రోజు ఈ పనులు చేయకూడదు!

Advertisement

Next Story