రామాయణం క్విజ్‌‌ను గెలిచిన ముస్లిం యువకులు!

by srinivas |
రామాయణం క్విజ్‌‌ను గెలిచిన ముస్లిం యువకులు!
X

దిశ, ఫీచర్స్ : 'రామాయణ మంత్' సందర్భంగా గత నెలలో నిర్వహించిన ఆన్‌లైన్ క్విజ్‌లో మహమ్మద్ బాసిత్ ఎం, మహమ్మద్ జబీర్‌ గెలుపొందారు. ఇందూ ఇతిహాసమైన రామాయణంపై నిర్వహించిన క్విజ్‌లో ఇస్లామిక్ కళాశాల విద్యార్థులు సాధించిన విజయం మీడియా దృష్టిని ఆకర్షించగా.. విభిన్న వర్గాల ప్రజలు వారిని అభినందించారు.

కేరళ, వాలంచేరిలోని కేకేఎస్‌ఎమ్ ఇస్లామిక్ అండ్ ఆర్ట్స్ కాలేజీలో వాఫీ ప్రోగ్రామ్‌(ఎనిమిదేళ్ల కోర్సు)లో బాసిత్ ఐదో సంవత్సరం చదువుతుండగా.. జబీర్ చివరి సంవత్సరంలో ఉన్నాడు. ఈ ఇతిహాసం గురించి తమకు చిన్నప్పటి నుంచి తెలిసినప్పటికీ వాఫీ కోర్సులో చేరిన తర్వాత వారు రామాయణంత పాటు హిందూ మతం గురించి లోతుగా అధ్యయనం చేయడం ప్రారంభించారు. ఇక వాఫీ సిలబస్‌లో అన్ని ప్రధాన మత బోధనలు ఉండగా.. కళాశాల లైబ్రరీలో ఇతర మతాలకు సంబంధించిన పుస్తకాల భారీ సేకరణ వారికి పురాణాలను చదివి అర్థం చేసుకునేందుకు సాయపడింది.

కోఆర్డినేషన్ ఆఫ్ ఇస్లామిక్ కాలేజీస్(CIC) కింద Wafy కోర్సు నిర్వహిస్తున్నారు. సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్ (SSLC) పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు మతపరమైన, తాత్కాలిక విద్యను మిళితం చేస్తూ అందిస్తున్న ఈ కోర్సును దాదాపు 97 క్యాంపస్‌లలో నేర్పిస్తున్నారు. ఇది పూర్తి చేసేందుకు 8 ఏళ్లు పడుతుంది.

దేశ సంస్కృతి, సంప్రదాయాలతో పాటు చరిత్రలో భాగమైన రామాయణ, మహాభారత ఇతిహాసాలను భారతీయులందరూ తప్పక చదవాలి. వాటి సారాన్ని అర్థం చేసుకుని, ఆచరించాలి. ఇది మన బాధ్యత అని నేను నమ్ముతున్నాను. రామయణం విషయానికొస్తే.. రాముడు తన తండ్రి దశరథునికి ఇచ్చిన వాగ్ధానాన్ని నెరవేర్చేందుకు రాజ్యాన్ని కూడా త్యాగం చేయాల్సి వస్తుంది. అధికారం కోసం అంతులేని పోరాటాలు జరుగుతున్న ఈ కాలంలో రాముడు వంటి పాత్రల నుంచి ప్రేరణ పొందాలి. శ్రీరాముడు ధర్మానికి, సహనానికి నిదర్శనం. ఇలాంటి ఉదాత్తమైన సద్గుణాలను ప్రతీ మనిషి అలవర్చుకోవాల్సిన అవసరముంది. ఇతర మతగ్రంథాల విస్తృత పఠనం.. ఇతర విశ్వాసాలను, ఆ వర్గాలకు చెందిన ప్రజలను మరింత అర్థం చేసుకునేందుకు సాయపడుతుంది. అలాగే ఏ మతం కూడా ద్వేషాన్ని ప్రోత్సహించదు. శాంతి, సామరస్యాలను మాత్రమే ప్రచారం చేస్తుంది. క్విజ్‌లో గెలవడం వల్ల ఇతిహాసాన్ని మరింత లోతుగా నేర్చుకునేందుకు అవసరమైన ప్రేరణ లభించింది.

- బాసిత్, జబీర్

Advertisement

Next Story

Most Viewed