- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అలెర్ట్: ఆఫీస్ వర్క్‌లోపడి గంటల తరబడి కూర్చుంటున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవు
దిశ, ఫీచర్స్: ప్రస్తుత కాలంలో ఆడా, మగా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు జాబ్ చేస్తున్నారు. అలా పని చేస్తున్న దగ్గర రోజంతా ఒకే చోట కూర్చుని లేదా నిలబడి పని చేయాల్సి ఉంటుంది. ఇలా గంటల తరబడి కంప్యూటర్ ముందు పని చేస్తూ చిన్న వయసులోనే వెన్నునొప్పితో బాధపడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది అని అనడంలో ఏమాత్రం అతియోశక్తి లేదు. అయితే అలా పని చేయడం ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తుంది. మరి దాని వల్ల ఎలాంటి నష్టాలు ఉంటాయి దాని గురించి నిపుణులు ఏం చెపుతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
*విపరీతమైన నొప్పితో వెనుక భాగం నుంచి నడుము వరకు నొప్పి వస్తుంటుంది. ఇలా నిరంతర పని కారణంగా వెన్నెముక సమస్యలు పుట్టుకొస్తున్నాయి. తక్షణ ఉపశమనం పొందడానికి చాలా మంది పెయిన్ రిలీఫ్ మందులు తీసుకుంటూ ఉంటారు. లేదా ఇంజెక్షన్లు తీసుకుంటారు. వీటి వల్ల ఎముకలు అరిగిపోయే ప్రమాదం ఉంది. వీటికి బదులు కాస్త జీవనశైలిలో మార్పులు చేస్తే సరిపోతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
*వెన్ను నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి నెమ్మదిగా యోగా చేయడం లేదా స్ట్రెచింగ్ చేయడం వల్ల ఉపశమనం పొందవచ్చు. రెగ్యులర్ ప్రాక్టీస్ నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
*అధిక ధూమపానం వెన్నెముక సమస్యల నుంచి కోలుకోవడాన్ని ఆలస్యం చేస్తుంది. ధూమపానం అలవాటు లేనివారు ఈ విధమైన వ్యాధుల నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.
*అలాగే తక్కువ నిద్రతో కూడా నడుము నొప్పి పెరుగుతుంది. నిద్రలో నరాలు, కండరాలు రిలాక్స్ అవుతాయి. ఫలితంగా మరుసటి రోజు మేల్కొన్నప్పుడు, ఆ కండరాలు తాజాగా ఉంటాయి.
కాబట్టి కుర్చీలో కూర్చున్నప్పుడు మీ వెన్నెముక భాగం నిటారుగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే నడుము నొప్పి రావడానికి ప్రధానంగా మీరు కుర్చీలో ఎలా కూర్చుంటారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. అధిక బరువు కూడా నడుము, వెన్ను నొప్పి ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి బరువును అదుపులో ఉంచుకోవాలి.
నోట్: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే దీనిని అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు సంబంధించి ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించడం ఉత్తమం.