మహిళలకు అలెర్ట్!.. ఎక్కువగా ఫోన్ ఉపయోగిస్తున్నారా.. అయితే డేంజర్‌లో పడ్డట్టే

by Kavitha |
మహిళలకు అలెర్ట్!.. ఎక్కువగా ఫోన్ ఉపయోగిస్తున్నారా.. అయితే డేంజర్‌లో పడ్డట్టే
X

దిశ, ఫీచర్స్: ఈ జనరేషన్‌లో మారుతున్న కాలానుగుణంగా టెక్నాలజి కూడా పెరిగిపోయింది. చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలివారి వరకు ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారు. మార్నింగ్ నుండి నైట్ నిద్రపోయే వరకు స్మార్ట్ ఫోన్ లోనే ప్రపంచాన్ని చూసేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు తినడం, పడుకోవడం, నిద్రపోవడం, నీరు త్రాగడం ఎలాగైతే చేస్తామో అలాగే ఫోన్ కూడా మన జీవితంలో ఒక భాగమైపోయింది. మనుషుల కన్నా ఈ ఫోన్‌కే ఎక్కువ ఇంపార్టెంట్స్ ఇస్తున్నాము. అయితే ఈ స్మార్ట్ ఫోన్ వల్ల ఎంత మంచి ఉందో, అంతే చెడు కూడా ఉంది. ఎక్కువగా మొబైల్‌ని వాడటం వలన చాలామంది అనారోగ్యం బారిన పడుతున్నారు.

*రోజంతా కంటిన్యూగా మొబైల్ వాడితే దాన్ని మొబైల్ అడిక్షన్ అని పిలుస్తారు. ఇలాంటి అలవాటు కారణంగా చాలా మంది ఎన్నో నష్టాలను చవిచూస్తున్నారు. కాబట్టి మొబైల్ వాడకాన్ని తగ్గించండి.

*అలాగే మొబైల్ వినియోగిస్తూ ఎక్కువ సేపు ఒకే పొజిషన్ లో ఉండటం వలన ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా మహిళల్లో గర్భాశయ సమస్యలు ఎదురయ్యే సమస్యలు ఉన్నాయి.

*దాంతో పాటుగా ఎముకలకు సంబంధించిన సమస్యలు, భుజాలు, మెడ, తల నొప్పితో పాటు వీపులో కూడా నొప్పి సంభవించవచ్చు.

*ముఖ్యంగా మహిళలకు వచ్చే గర్భాశయ నొప్పి కారణంగా లేవడం, కూర్చోవడం కష్టంగా మారే అవకాశాలు ఉన్నాయి.

*కొంతమంది మొబైల్ ఉపయోగిస్తూ రిలాక్స్డ్ అవుతుంటారు. అలా కావడం ద్వారా శరీరంలో పటుత్వం కోల్పోయి ఏ చిన్న పనియైన ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంతే కాకుండా మహిళలకు సంతానలేమి సమస్యలు కూడా వచ్చే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed