Alert: శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే, మీ కిడ్నీలు పాడవుతున్నట్లే..

by Kavitha |
Alert: శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే, మీ కిడ్నీలు పాడవుతున్నట్లే..
X

దిశ, వెబ్‌డెస్క్: మన శరీరంలో కిడ్నీలు ఎంత ముఖ్యమైనవో మనందరికీ తెలిసిందే. బేసిక్‌గా మూత్రపిండాలు ఫిల్టర్ లాగా పనిచేస్తూ మన శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను మూత్రం ద్వారా బయటకు పంపిస్తాయి. అలా కాని యెడల శరీరంలో టాక్సిన్స్ ఉండిపోయి చాలా రకాల వ్యాధులు రావడం మొదలవుతాయి.

అందుకే.. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవాలని వైద్యులు సలహా ఇస్తుంటారు. ఇందుకోసం మన రోజు వారి భాగంలో కొన్ని ప్రత్యేక మార్పులు చేసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా.. ఆహారంతో పాటు.. కొన్ని విషయాలను రెగ్యులర్‌గా పాటించాలి అని అంటున్నారు. మరి కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం మనం ఎలాంటి విషయాలు అలవాటు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

*అసలు మూత్రపిండాల వ్యాధి ప్రమాదాన్ని ఎలా గుర్తించాలి..?

రెండు కిడ్నీలలో ఏదైనా ఒకటి పనిచేయకపోవడం వల్ల శరీరంలో అనేక రకాల లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తాయి. ఈ హెచ్చరిక సంకేతాలను ఎలా గుర్తించాలో ముందుగా తెలుసుకుందాం..

1) చర్మం రంగు తెల్లగా మారుతుంది

2) చర్మం చాలా పొడిగా మారుతుంది

3) గోళ్లు తెల్లగా మారడం ప్రారంభమవుతుంది

4) గోళ్లు బలహీనంగా మారడం మొదలవుతాయి

5) దురద స్ట్రెచ్ మార్క్స్ లాంటివి కనిపించవచ్చు.

*మూత్రపిండాలు ఎలా రక్షించుకోవాలి..?

బరువును నియంత్రించుకోండి:

ఫస్ట్ ఫాల్ బరువు పెరగడం అనేది మూత్రపిండాల ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే ఇది మధుమేహం, గుండె జబ్బులు, అధిక రక్తపోటుకు కారణమవుతుంది. దీని వల్ల కిడ్నీలు కూడా చాలా దెబ్బతింటాయి.

నిద్రకు భంగం కలిగించవద్దు:

మీరు రోజు నిద్ర పోవడం- లేవడం అనే సమయాన్ని ఒకేలా ఉండేలా సరి చేసుకోండి.. దాన్ని ఎక్కువగా మార్చవద్దు. అలాగే ప్రతిరోజూ కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోయేలా చూసుకోండి. దీని వల్ల మూత్రపిండాల ఆరోగ్యం చెక్కుచెదరకుండా ఉంటుంది.

రోజుకు సరిపడా నీరు తాగండి:

అలాగే రోజుకు కనీసం నాలుగు లీటర్ల నీరు తాగడం చాలా ముఖ్యం.. సరిపడా నీళ్లు తాగడం వల్ల హైడ్రేషన్‌గా ఉండటంతోపాటు కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

శారీరక కార్యకలాపాలు:

మీరు రోజుకు అరగంట పాటు వ్యాయామం లేదా మరేదైనా శారీరక శ్రమ చేస్తే, మీ రక్తపోటు బాగా నియంత్రణలో ఉంటుంది. దీంతో కిడ్నీ సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి.

నోట్: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే దీనిని అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు సంబంధించి ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

Advertisement

Next Story

Most Viewed