అలెర్ట్..! రుచిగా ఉన్నాయని మామిడి పండ్లు అతిగా తింటున్నారా.. ఈ సైడ్ ఎఫెక్ట్స్ కలగడం ఖాయం

by Kavitha |
అలెర్ట్..! రుచిగా ఉన్నాయని మామిడి పండ్లు అతిగా తింటున్నారా.. ఈ సైడ్ ఎఫెక్ట్స్ కలగడం ఖాయం
X

దిశ, ఫీచర్స్: సాధారణంగా ఏడాదికోసారి వచ్చే మామిడి పండ్లు అంటే అందరూ ఇష్టపడతారు. కొంతమంది అయితే వాటిని తినడమే పనిగా పెట్టుకుంటారు. అయితే మరీ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఇబ్బందులు కూడా తప్పవు. వీటితో జీర్ణక్రియ సమస్యలు, పొత్తికడుపులో తిమ్మిరి, విరేచనాలు వంటి జీర్ణ క్రియ సంబంధమైన ఇబ్బందులతో పాటు.. ఇంకా ఎలాంటి సమస్యలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం.

జీర్ణక్రియ:

మామిడి పండ్లు అధికంగా తీసుకుంటే ఇందులోని అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా ఉబ్బరం, గ్యాస్, పొత్తి కడుపు తిమ్మిరి, విరేచనాలు వంటి సమస్యలు రావచ్చు. జీర్ణక్రియ బలహీనం అవుతుంది.

బరువు పెరుగుతారు:

అధికంగా మామిడి పండ్లను తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇందులోని అధిక కేలరీలు శరీరంలో బరువు పెరిగేలా చేస్తాయి.

అలెర్జీలు:

మామిడి పండ్లను అదేపనిగా తీసుకోవడం వల్ల దురద, వాపు, దద్దుర్లు, అనాఫిలాక్సిస్ వంటి లక్షణాలు కనిపిస్తాయి.

బ్లడ్ షుగర్ లెవల్స్:

మామిడి పండ్లు ఎక్కువగా తీసుకుంటే చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. మధుమేహం ఉన్నవారికి లేదా ఇన్సులిన్ రెసిస్టెంట్ ఉన్నవారికి సమస్యాత్మకంగా ఉంటుంది.

విటమిన్ ఎ టాక్సిసిటీ:

మామిడి పండ్లు విటమిన్ ఎ అద్భుతమైన మూలం. అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో పోషకం అధికంగా ఉంటుంది. దీంతో హైపర్ విటమినోసిస్ ఎ అనే పరిస్థితి ఏర్పడుతుంది. వీటి లక్షణాలు మైకం, వికారం, దృష్టిలోపం, జుట్టు రాలడం వంటి సమస్యలుంటాయి.

చికాకు:

మామిడి పండ్లలో ఉరుషియోల్ అనే పదార్థం కారణంగా పోయిజన్ ఐవీ, పాయిజన్ ఓక్ ఉంటాయి. ఇవి మామిడి పండ్లు తిన్న తర్వాత నోటిలో లేదా పెదవులపై చికాకుగా ఉండి దురదలా ఉంటుంది. మామిడి పండ్ల పై తోలును సరిగా క్లీన్ చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి ఉంటుంది.

నోట్: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే దీనిని అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు సంబంధించి ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

Advertisement

Next Story

Most Viewed