- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మందు కొడితే.. ఇంగ్లీష్ ఈజీగా మాట్లాడేయొచ్చు.. ట్రై చేసి చూడండి!
దిశ, ఫీచర్స్: ఆల్కహాల్ జ్ఞాపకశక్తి, శ్రద్ధను తగ్గిస్తుందని పలు అధ్యయనాల్లో రుజువు అయింది. ఓవర్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఎస్టిమేషన్‌కు కూడా దారితీస్తుందని తేలింది. అయితే ఇన్ని ప్రతికూల ప్రభావాలను కలిగిన మద్యం.. ఫారిన్ లాంగ్వేజెస్‌ను ఫ్లూయెంట్‌గా మాట్లాడటంలో హెల్ప్ చేస్తుందని నిర్ధారించింది మరో అధ్యయనం. బ్రిటిష్, డచ్ పరిశోధకులు చేసిన ప్రయోగంలో వెలువడిన ఫలితాల్లో.. ఒక గ్లాసు బీర్ లేదా వైన్ భయాన్ని, సంకోచాన్ని అధిగమించడం సులభతరం చేస్తుందని.. తద్వారా స్థానికేతర భాషలను సులభంగా మాట్లాడే ధైర్యాన్ని ఇస్తుందని స్పష్టమైంది.
జర్మనీ సరిహద్దుకు సమీపంలో నెదర్లాండ్స్‌లోని మాస్ట్రిక్ట్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న 50 మంది స్థానిక జర్మన్ మాట్లాడేవారు ఉన్నారు. అయితే డచ్‌లో తరగతులు బోధించబడుతున్నందున.. భాషలో నైపుణ్యాన్ని ప్రదర్శించడంలో కాస్త వెనుకబడి ఉన్నారు. కాగా వీరిలో సగం మందికి నీరు, మిగిలిన వారికి ఆల్కహాల్ అందించారు పరిశోధకులు. తర్వాత రెండు గ్రూపులకు చెందిన వారి డచ్ కమ్యూనికేషన్ స్కిల్స్ రికార్డ్ చేసి, స్కోర్ చేశారు. ఫలితాల్లో ఆల్కహాల్ గ్రూప్‌లోని వ్యక్తులు నీరు తాగిన సమూహంలో ఉన్నవారి కంటే మెరుగైన భాష ప్రయోగం, ఉచ్ఛారణ కలిగి ఉన్నట్లు తెలిపారు. అయితే అధ్యయనంలో తక్కువ మోతాదులో బీర్ లేదా వైన్ తీసుకోవడం వల్ల ఇలాంటి రిజల్ట్ ఉందని, ఎక్కువగా తీసుకుంటే అలా ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు పరిశోధకులు.