- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెంటల్ హెల్త్‌పై ఏజ్ డిస్క్రిమినేషన్ ఎఫెక్ట్
దిశ, ఫీచర్స్ : ఇటీవల ఎమ్మీ అవార్డ్స్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. విజేతలను అత్యంత అద్భుతంగా సత్కరించారు. కానీ ఈ క్రమంలోనే చోటుచేసుకున్న ఓ సన్నివేశాన్ని మాత్రం చాలా మంది నిపుణులు మరిచిపోలేకపోతున్నారు. ఇందుకు 'వయో వివక్షే(ఏజిజమ్)' కారణం. ఎందుకంటే నామినీస్‌లో ఒకరైన జెండాయా పేరును అనౌన్స్ చేసిన హోస్ట్.. ఆమె ఈ మధ్యే 26 ఏళ్ల ప్రాయంలోకి అడుగుపెట్టిందని, దీంతో 47 ఏళ్ల హీరో లియోనార్డో డికాప్రియోతో డేటింగ్ చేసేందుకు అర్హత కోల్పోయిందని జోక్ పేల్చాడు. ఇందుకు అక్కడున్నవారంతా గొల్లుమన్నా.. నిజానికి నవ్వాల్సిన విషయం కాదంటున్నారు విశ్లేషకులు. ఇది పరోక్షంగా ఏజ్ గురించి డిస్క్రిమినేట్ చేయడమేనని వాదిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఏజ్ ఫ్యాక్టర్‌ను ఓల్డ్ ఫ్యాషన్‌గా గుర్తించానని చెబుతోంది 72 ఏళ్ల ఫ్యాషన్ డిజైనర్ వెరా వాంగ్ వయసు ఆధారంగా అలుముకున్న మూస పద్ధతులు, పక్షపాతం, వివక్షను 'వయోవాదం'గా నిర్వచించిన ఆమె.. లోతుగా పాతుకుపోయిన ఈ భావన సమానత్వాన్ని కొనసాగించడంలో ఎలా సమస్యగా మారుతుందో వివరించింది. ఎమ్మీ అవార్డ్స్‌లో ఏజిజమ్ జోక్ ఫన్నీగా అనిపించవచ్చు గానీ.. అది లింగ వివక్ష, జాత్యహంకారానికి నిదర్శనమని చెప్తోంది. వాస్తవంగా వయోభారం సర్వసాధారణమైనా.. మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని తెలిపింది.
వయసు పక్షపాతాన్ని ఛేదిస్తున్న మహిళలు :
భారతీయ మహిళలు వయో పక్షపాతాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పుకోవడం ఆనందంగా ఉంది. 83 ఏళ్ల వయసులో ప్రముఖ నటి వహీదా రెహ్మాన్ స్నార్కెలింగ్‌కు వెళ్తున్నారు. అలాగే 60 ఏళ్లు నిండిన తర్వాత కూడా డ్యాన్స్‌పై తనకున్న మక్కువను పునరుద్ధరించుకుంటోంది 'డ్యాన్సింగ్ దాదీ' రవిబాలా శర్మ. అంతేకాదు కొన్ని నెలల క్రితం గుజరాత్‌లో 100 మీటర్ల రేసులో రికార్డు సృష్టించిన 105 ఏళ్ల రాంబాయి కూడా మనందరికీ ఆదర్శమూర్తి.
మరోవైపు యంగర్ ఉమెన్ కూడా అన్ని రంగాల్లో తమదైన ముద్ర వేస్తున్నారు. స్పోర్ట్స్, ఫ్యాషన్, వ్యాపారంలో అద్భుతంగా రాణిస్తున్నారు. కానీ సమాజం వయసు పెరిగేకొద్దీ స్త్రీ పురుషుల పట్ల భిన్నమైన అంచనాలను కలిగి ఉంటుంది. ఉదాహరణకు 50 ఏళ్ల వయసున్న వ్యక్తి 20 ఏళ్ల మహిళతో డేటింగ్ చేయడం అసాధారణం కాదు. కానీ 40 ఏళ్ల మహిళ అదే పనిచేస్తే మాత్రం తప్పయిపోతుంది. క్యారెక్టర్‌లెస్‌గా ముద్రవేయబడుతుంది.
మానసిక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?
2022 అధ్యయనం ప్రకారం వయో వివక్షను అనుభవించిన వృద్ధులు.. నిరాశ, ఆందోళనతో బాధపడే అవకాశం అధికంగా ఉంది. సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ వర్త్ తగ్గడానికి కూడా వయసే కారణమవుతుందని కనుగొనబడింది. అంతేకాదు ఏజిజమ్ అనేది ఒంటరితనంతో డిప్రెషన్‌లో కూరుకుపోయే పరిస్థితిని తీసుకొస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి మానసిక ఆరోగ్య పరిస్థితులను మరింత తీవ్రతరం చేస్తుంది.
1. మూస పద్ధతులను అంతర్గతీకరించవద్దు :
అన్నింటిలోకెల్లా మొదటిది.. వయసుతో పాటుగా వచ్చే మూస పద్ధతులను అనుసరించకుండా ఉండటం ముఖ్యం. వయసు ఆధారంగా ఎవరైనా విమర్శిస్తే.. ప్రజలు చెప్పే ప్రతికూల విషయాలు నమ్మితే ఆత్మగౌరవం, సెల్ఫ్ వాల్యూ తగ్గిపోతుంది. ఈ రెండూ మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి.
2. మీ కోసం మాట్లాడండి :
వయసు లేదా లింగం కారణంగా అన్యాయం జరుగుతుందని భావిస్తే వాదించడం ముఖ్యం. ప్రత్యేకించి ఉద్యోగం, సంబంధాన్ని కోల్పోతారని లేదా సమస్యాత్మకంగా లేబుల్ చేయబడే సందర్భంలో మీ హక్కును గుర్తుంచుకోవాలి. కొన్నిసార్లు సమస్య పరిష్కారానికి సాధారణ సంభాషణ కూడా సరిపోతుంది.
3. సహాయక సంబంధాలను వెతకండి :
ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తూ విజయాలపై ప్రశంసలు కురిపించే వారితో గడపాలి. అలాంటి వారితో స్నేహం మంచి అనుభూతిని కలిగిస్తుందని గుర్తుంచుకోవాలి. ఇలాంటి సపోర్టివ్ రిలేషన్‌షిప్స్‌లో స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా సహోద్యోగులు కూడా ఉండవచ్చు. అలాంటి వ్యక్తులతో సహవాసం ద్వారా వయోభారంతో వచ్చే సవాళ్లను ఎదుర్కోవడం సులభం అవుతుంది.
4. నమ్మకంగా ఉండండి :
ఆత్మవిశ్వాస లోపం ఫలితంగా వృద్ధాప్యం తరచూ వ్యక్తమవుతుంది. మీపై మీకు నమ్మకం లేకపోతే ఇతరులు కూడా నమ్మరు. మీరు లోపల అనుభూతి చెందకపోయినా, విశ్వాసాన్ని ప్రదర్శించడం చాలా ముఖ్యం. దీని అర్థం తప్పులు చేస్తారనే భయం లేకుండా మీటింగ్స్‌లో మాట్లాడటం, కొత్త ఆలోచనలను అందించడం. మీరు ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించడం ప్రారంభించిన తర్వాత, ఇతరులు మిమ్మల్ని కొత్త కోణంలో చూడటం ప్రారంభిస్తారు. ఒక ఆస్తిగా పరిగణిస్తూ రిస్క్‌లు తీసుకోవడానికి ముందుకొస్తారు.
5. సలహాదారులను వెతకండి :
మార్గదర్శి అంటే మార్గదర్శకత్వం, సలహాలు, మద్దతును అందించగల వ్యక్తి. సక్సెస్ కావడానికి ఏం అవసరమో తెలిసిన మేధావి. జీవితంలోని వివిధ కోణాల్లో వయోభారాన్ని అధిగమించడానికి ఒక గురువు అమూల్యమైన వనరుగా ఉంటారు. కాబట్టి వారిని వెతికేందుకు భయపడకండి.
ఇవి కూడా చదవండి :