WOMEN BODY : 30ఏళ్ల తర్వాత స్త్రీ శరీరంలో కలిగే మార్పులివే..

by Sujitha Rachapalli |
WOMEN BODY : 30ఏళ్ల తర్వాత స్త్రీ శరీరంలో కలిగే మార్పులివే..
X

దిశ, ఫీచర్స్: 30ఏళ్లు రావడం అనేది స్త్రీ శరీరంలో సరికొత్త మార్పులకు నాంది పలుకుతుంది. చర్మం నుంచి ఎముకల బలహీనత వరకు ప్రతి విషయంలో ఇది జరుగుతుంది. అయితే ఈ చేంజేస్ అర్థం చేసుకుని.. తగిన జాగ్రత్తలు తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యంతో ఉండొచ్చని సూచిస్తున్నారు నిపుణులు. వ్యాయామం, డైట్ విషయంలో సరైన చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. అసలు ఆ మార్పులు ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తెలుసుకుందాం.

మందగిస్తున్న జీవక్రియ

స్త్రీలు 30లలోకి ఎంటర్ అయినప్పుడు.. జీవక్రియ మందగిస్తుంది. దీంతో సులభంగా బరువు పెరుగుతారు. అందుకే చురుకైన జీవనశైలి, సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా వెయిట్ మేనేజ్మెంట్ సాధ్యం అవుతుందని సూచిస్తున్నారు నిపుణులు. వర్క్ అవుట్, వాకింగ్ తోపాటు ఎక్స్ పర్ట్ సలహాతో డైట్ తీసుకోవడం బెటర్ అంటున్నారు.

హార్మోన్ల హెచ్చు తగ్గులు

ఈస్ట్రోజెన్, ప్రొజెస్టరాన్ తో సహా హార్మోన్లలో మార్పులు చోటు చేసుకుంటాయి. మానసిక ఆరోగ్యం, ఋతు క్రమం, చర్మ ఆరోగ్యంపై ఎఫెక్ట్ చూపుతాయి. కొంత మంది స్త్రీలు పెరిమెనోపాజ్ లక్షణాలు అనుభవిస్తారు. సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గడం ప్రారంభం అవుతుంది .

స్కిన్ ఎఫెక్ట్

చర్మంలో కొల్లాజెన్, ఎలాస్టిన్ ఉత్పత్తి తగ్గుతుంది. ఫైన్ లైన్స్, ముడతలు ఏర్పడటానికి దారితీస్తుంది. స్కిన్ సహజమైన మెరుపు, స్థితిస్తాపకతను కోల్పోతుంది. అంటే యవ్వనం ముగుస్తూ.. వృద్ధాప్య ఛాయలు ఏర్పడటం ప్రారంభమవుతాయి అంటున్నారు నిపుణులు.

ఎముక సాంద్రత

30 ఏళ్ల తర్వాత స్త్రీలలో ఎముక సాంద్రత క్షీణించడం ఆరంభం అవుతుంది. బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి ఎముక ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వెయిట్ లిఫ్ట్ చేసే వ్యాయామాలు చేయాలని సూచిస్తున్నారు. కాల్షియం, విటమిన్ డి తీసుకోవడం ముఖ్యమంటున్నారు.

కండర ద్రవ్యరాశి, బలం

ఏజ్ పెరుగుతున్నా కొద్ది కండర ద్రవ్యరాశి, శక్తిలో క్రమంగా తగ్గుదల కనిపిస్తుంది. శక్తి శిక్షణ వ్యాయామాలను చేయడం ద్వారా కండరాల ద్రవ్యరాశి సరిగ్గా మేనేజ్ చేయవచ్చు. ఫిట్ నెస్ తో హెల్తీ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చని చెప్తున్నారు ఎక్స్ పర్ట్స్.

Advertisement

Next Story