జాబ్ మార్కెట్ రియాలిటీ.. రెజ్యూమ్ ఇలా ప్లాన్ చేయండి.. లేదంటే డస్ట్ బిన్‌కే...

by Sujitha Rachapalli |
జాబ్ మార్కెట్ రియాలిటీ.. రెజ్యూమ్ ఇలా ప్లాన్ చేయండి.. లేదంటే డస్ట్ బిన్‌కే...
X

దిశ, ఫీచర్స్ : జాబ్ మార్కెట్ రియాలిటీ గురించి వాస్తవాలు వివరించిన ఓ ఇంటర్వ్యూయర్... రెజ్యూమ్ ఎలా ప్లాన్ చేయాలో వివరించాడు. నిజానికి రిక్రూటర్స్ దీనిపై ఎక్కువ కాన్సంట్రేట్ చేయలేరని.. అందుకే 20 సెకన్లలో చదివేసేలా ప్రిపేర్ చేయాలని సూచిస్తున్నారు.

  • గోల్డెన్ రూల్ ఏంటంటే మన వివరాలు సంక్షిప్తంగా ఉండటం. ఒక పేజీలోనే పూర్తి వివరాలు ఉండేలా చూసుకోవాలని లేదంటే గరిష్టంగా రెండు పేజీలు చాలని సూచిస్తున్నారు.
  • డిజైన్స్ కంటే సింపుల్ టెంప్లేట్ బెస్ట్ అని సూచిస్తున్నారు. అది కూడా MS Word వల్ల వచ్చే ఫార్మాటింగ్ ప్రాబ్లమ్స్ నివారించేందుకు PDF రూపంలో సేవ్ చేసుకోమని చెప్తున్నారు.
  • మీ రెజ్యూమ్ లో ప్రధాన విభాగం స్కిల్స్. కాగా వీటిని హైలెట్ చేయడం మరిచిపోవద్దని చెప్తున్నారు. స్పష్టంగా ఉండేలా చూసుకోమని అంటున్నారు.
  • మీ రెజ్యూమ్ లో ప్రాజెక్టు వివరాలు అవసరం లేదంటున్నారు. ఒకవేళ మీరు దరఖాస్తు చేస్తున్న ఉద్యోగానికి సంబంధించినది అయితేనే చేర్చమని సూచిస్తున్నారు.
  • మీ విద్య, పని చేసిన ప్రదేశం, హోదా కచ్చితంగా మెన్షన్ చేయమని చెప్తున్నారు.
Advertisement

Next Story

Most Viewed