నగ్నంగా తిరిగేస్తున్న బ్రిటీష్ వాళ్లు.. సకల సౌకర్యాలున్నా..

by Prasanna |
నగ్నంగా తిరిగేస్తున్న బ్రిటీష్ వాళ్లు.. సకల సౌకర్యాలున్నా..
X

దిశ, ఫీచర్స్: యూరప్ ప్రజలు ప్రపంచంలోనే అత్యంత నాగరికత కలిగి ఉన్నారని చరిత్రకారులు చెప్తుంటారు. కానీ ఈ ప్రాంతంలో కూడా ఆఫ్రికాలోని జరావా, హింబా, సెంటినెల్ తెగల మాదిరిగా నగ్నంగా నివసిస్తున్నారు. బ్రిటన్‌లోని స్పీల్‌ప్లాట్జ్ న్యూడిస్ట్ విలేజ్ ఇందుకు కేరాఫ్ కాగా.. అపారమైన ఆస్తులకు యజమానులైనా సరే న్యూడ్‌గానే తిరుగుతుంటారు. డబ్బు, విలాసవంతమైన జీవనశైలి ఉన్నా కూడా 90ఏళ్లకు పైగా ఈ సంప్రదాయాన్నే కొనసాగిస్తున్నారు. ఇది మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ ఈ కారణంతోనే ఈ రహస్య నగ్న గ్రామం ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంది.

బ్రిటన్‌లోని ఇతర ప్రాంతాల మాదిరిగానే ఇక్కడ కూడా చాలా అభివృద్ధి కనిపిస్తుంది. సౌకర్యాలకూ కొరతలేదు. కానీ సంప్రదాయాలను గుడ్డగా నమ్మే ఇక్కడి జనం బట్టలు లేకుండానే బతికేస్తున్నారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు కూడా దుస్తులు ధరించకుండా హ్యాపీగా తిరిగేస్తున్నారు. న్యూడిటీని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అద్భుతమైన ఇళ్లు, స్విమింగ్ పూల్స్, బార్స్ కలిగిన ఆ గ్రామంలో ఇప్పటికీ ఈ మూఢవిశ్వాసం కొనసాగుతోంది. నిజానికి స్పీల్‌ప్లాట్జ్ గ్రామం ఎప్పుడూ చర్చకు కేంద్రంగా ఉంటుంది. ప్రజలు ఇక్కడకు వచ్చి ఫోటోస్, డాక్యుమెంటరీస్, సినిమాలు కూడా తీస్తుంటారు. ఇక స్పీల్‌ప్లాట్జ్ అంటే ఆట స్థలం. కాగా అయినా సరే ఈ గ్రామం ప్రపంచంతో సంబంధాలను తెంచుకోలేదు. ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు ఇక్కడ సందర్శించడానికి వస్తారు. నగరానికి చెందిన పోస్ట్ మెన్, డెలివరీ బాయ్స్ కూడా ఇక్కడికి వస్తుండగా.. ఆన్‌లైన్ డెలివరీ కూడా అందుబాటులో ఉంది.

Advertisement

Next Story