రోజుకు రెండుసార్లు మాత్రమే భోజనం చేస్తే శరీరంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయంటే...

by Sujitha Rachapalli |
రోజుకు రెండుసార్లు మాత్రమే భోజనం చేస్తే శరీరంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయంటే...
X

దిశ, ఫీచర్స్ : జనాలు బిజీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. కుకింగ్ చేసే టైం లేక ఇన్ స్టాంట్ ఫుడ్ కు అలవాటు పడిపోయారు. ఈ క్రమంలో ఫాస్ట్ ఫుడ్ తీసుకుంటుండంతో బరువు పెరిగిపోతున్నారు. దీర్ఘకాలిక అనారోగ్యాలు వెంటాడుతున్నాయి. అయితే ఇలా కాకుండా రోజుకు రెండు సార్లు మాత్రమే సరైన భోజనం తీసుకోవడం వల్ల హెల్తీగా ఉంటారని సూచిస్తున్నారు నిపుణులు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల కలిగే లాభాల గురించి వివరిస్తున్నారు.

  • వెయిట్ మేనేజ్మెంట్ ...... రోజుకు రెండుసార్లు భోజనాలు చేయడం కారణంగా కేలరీలు తీసుకోవడం తగ్గుతుంది. దీనివల్ల బరువు తగ్గుతారు. సరైన వెయిట్ మేనేజ్ చేయగలుగుతారు.
  • ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగు ..... మీల్స్ తీసుకోవడాన్ని తగ్గించడం వలన రక్తంలో షుగర్ లెవల్స్ స్థిరంగా ఉంటాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. టైప్ 2 డయాబెటిస్ రిస్క్ తగ్గుతుంది.
  • మెటబాలిక్ హెల్త్ పెరుగుదల ..... ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ మెటబాలిక్ ఫ్లెక్సిబిలిటీ పెంచుతుంది. గ్లూకోజ్, ఫ్యాట్ బర్న్ చేస్తూ శక్తిగా మారుస్తుంది.
  • మంటను తగ్గిస్తుంది .... డైలీ టూ మీల్స్ బాడీలో అద్భుతమైన మార్పులు కలిగిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధులతో సంబంధం కలిగిన నొప్పి, వాపు, మంటను తగ్గించడంలో సాయం చేస్తుంది.
  • ఎనర్జీ లెవల్స్ పెరుగుదల ..... తక్కువ ఫుడ్ తీసుకోవడం వల్ల కొందరిలో ఎనర్జీ, ఫోకస్ పెరుగుతుంది. స్థిరమైన బ్లడ్ షుగర్ లెవల్స్, జీర్ణ వ్యవస్థపై లోడ్ తగ్గడం వల్ల ఇలా జరుగుతుందని చెప్తున్నారు నిపుణులు. సెల్యులార్ రిపేర్ ప్రాసెస్ ప్రమోట్ చేస్తుంది. లైఫ్ స్పాన్ పెరుగుతుంది.
Advertisement

Next Story