Happy Fathers Day : నాన్న.. ఈ టెస్ట్ చేయించుకో..

by Sujitha Rachapalli |
Happy Fathers Day : నాన్న.. ఈ టెస్ట్ చేయించుకో..
X

దిశ, ఫీచర్స్ :50 ఏళ్లకు చేరుకోవడం అంటే ఒక మైల్ స్టోన్ రీచ్ అవడమే. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో ఇది ఒక మైలు రాయి. కాగా ఫాదర్స్ డే సందర్భంగా మీ తండ్రికి ఎస్సెన్షియల్ మెడికల్ టెస్టులు చేయించండి. ఆ రూపంలో గిఫ్ట్ ప్లాన్ చేయండి. ఈ పరీక్షలు శరీరంలోని అనారోగ్యాన్ని బయటకు తీయొచ్చు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయొచ్చు.

1. ప్రొస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్

ప్రపంచంలో ఎక్కువ మంది పురుషులకు వస్తున్న క్యాన్సర్.. ప్రొస్టేట్ క్యాన్సర్. 2019లో వరల్డ్ జర్నల్ ఆఫ్ అంకాలజీలో ప్రచురించిన నివేదిక ప్రకారం 3.8శాతం మంది పురుషులు ఈ క్యాన్సర్ కారణంగా చనిపోతున్నారు. నిజానికి వయసుతో సంబంధం లేకుండా ఈ క్యాన్సర్ బారిన పడొచ్చు కానీ ఏజ్ పెరుగుతుంటే మరింత రిస్క్ పెరుగుతుంది. 50ఏళ్లు పైబడిన వారికి ఎక్కువ ప్రమాదం ఉంది. కాబట్టి PSA టెస్ట్ మస్ట్ అంటున్నారు నిపుణులు. ఈ రక్త పరీక్ష ప్రొస్టేట్ తయారు చేస్తున్న ప్రొటీన్ లెవల్స్‌ను సూచిస్తుంది. అధిక పీఎస్ఏ లెవల్ ఉన్నవారు ఈ క్యాన్సర్‌ బాధితులు అయ్యే అవకాశం ఉంటుంది.


2. కొలనోస్కోపి

కొలనో క్యాన్సర్‌ ప్రమాదం ఉన్న వ్యక్తులు ఇన్‌ఫ్లమేటరీ బౌల్ సిండ్రోమ్ హిస్టరీ కలిగి ఉంటారు. అందుకే 50 ఏళ్లు పైబడిన వారు కొలనోస్కోపి చేయించుకోవడం బెటర్. ముందుగానే దీని గురించి తెలుసుకుంటే క్యాన్సర్ నుంచి కాపాడుకోవచ్చు.

3. బ్లడ్ ప్రెజర్ స్క్రీనింగ్

ప్రతి ఒక్కరు రెగ్యులర్‌గా బీపీ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా 50క్రాస్ అయిన వారికి హైపర్ టెన్షన్ లేదా హై బ్లడ్ ప్రెజర్ డేంజర్ అని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇది కాస్త హార్ట్ ఎటాక్, స్ట్రోక్‌కు దారితీస్తుంది.

4. కొలెస్ట్రాల్ చెక్

లిపిడ్ ప్రొఫైల్ లేదా కొలెస్ట్రాల్ చెక్ అనేది సింపుల్ బ్లడ్ టెస్ట్. ఇది రక్తంలోని కొవ్వును డిటర్మైన్ చేస్తుంది. ఒకవేళ కొలెస్ట్రాల్ లెవల్స్ ఎక్కువగా ఉంటే.. గుండె సంబంధిత సమస్యలు అధికం అవుతాయి. కాగా ప్రతి ఒక్కరు ఐదేళ్లకోసారి కొలెస్ట్రాల్ చెక్ చేయించుకోవాలని సూచిస్తున్నారు ఎక్స్‌‌‌‌‌‌పర్ట్స్.

5. డయాబెటిస్ టెస్ట్

HbA1c టెస్ట్ 50ఏళ్లు పైబడిన వారికి కీలకం. ఈ డయాబెటిస్, ప్రీడయాబెటిస్ టెస్ట్ రక్తంలో గ్లూకోజ్‌‌, హిమోగ్లోబిన్ లెవల్స్ మెజర్ చేస్తుంది. ముందుగానే టెస్ట్ చేయించుకుంటే..షుగర్ కంట్రోల్ చేసుకోవచ్చని, ఆరోగ్యంగా ఉండొచ్చనేది నిపుణుల సూచన.

6. కంటి పరీక్ష

50ఏళ్లు రీచ్ అయిన వ్యక్తులకు రెగ్యులర్ ఐ చెకప్ ఇంపార్టెంట్ అని సూచిస్తున్నారు వైద్యులు. మీ తండ్రి కళ్లజోడు ధరిస్తే, వారి దృష్టి నాణ్యతలో ఏదైనా క్షీణత ఉందా అని పరీక్షించడం మంచిది. ఈ టెస్టుల ద్వారా 50లలో వచ్చే కట్టర్, గ్లాకోమా వంటి ఇతర కంటి సమస్యలు ఉన్నాయేమో తెలుసుకోవచ్చు.

7. కాల్షియం టెస్ట్

ఈ బ్లడ్ టెస్ట్ బాడీలో కాల్షియం లెవల్స్‌ను నిర్ధారిస్తుంది. దీనివల్ల ఎముకల ద్వారా వచ్చే వ్యాధులు మాత్రమే కాదు దంతాలు, గుండె, నరాల సంబంధిత సమస్యలను కూడా తెలుసుకోవచ్చు.

Advertisement

Next Story

Most Viewed