- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నా భర్తతో పడుకోవడానికి మనసు ఒప్పడం లేదు.. ఆయన అలా ఉంటాడు..!
దిశ, వెబ్ డెస్క్ : సంసార జీవితం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో కష్టాలను, కన్నీటిని దాటుకొని తమ దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తున్నారు. కొందరు సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తే మరికొందరు కష్టాన్ని ఇష్టంగా మలుచుకొని తన దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తారు.
ఇక ముఖ్యంగా మహిళల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందరో మహిళలు తాళి అనే బంధంతో గమ్యం తెలియని నావలో ప్రయాణిస్తుంటారు. కట్టుకున్నవాడితో కష్టాలను భరిస్తూ, వారికి అర్థమయ్యేలా చెప్పలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అలాగే ఓ మహిళ పెళ్లై ఆరు సంవత్సరాలు అవుతున్నా.. తన భర్త వ్యక్తిగత శుభ్రత పాటించకుండా, చెప్పింది వినడం కూడా మానేయడంతో, దాంపత్య జీవితం పెద్ద సమస్యగా మారింది. ఏం చేయాలో తోచలేక, మానసిక నిపుణులను కలిసి తన బాధను ఇలా వ్యక్తత పరిచింది.
నాకు పెళ్లై ఆరేళ్లు అవుతుంది. నా భర్త వ్యక్తిగత శుభ్రత పాటించడం లేదు. నాకేమో పరిశుభ్రత అంటే ఇష్టం. అతనేమో రోజూ స్నానం చేయడు. ఎన్ని సార్లు శుభ్రంగా ఉండు అని చెప్పినా వినిపించుకోలేదు. పైగా తన ఫ్యామిలీలో చాలా మంది అలానే ఉంటారు. మొదట్లో పెర్ ఫ్యూమ్, ఫేస్ క్రీమ్ వంటి వాడమని చెప్పాను, కానీ అతను నా మాట వినడం మానేసాడు, అతని అపరిశుభ్రత వలన మా దాంపత్య జీవితంలో చాలా సమస్యలు వస్తున్నాయి. ఏం చేయాలో బదులివ్వండి సర్ అంటూ ఓ మహిళ మానసిక నిపుణలను కోరింది.
దానికి వైద్యుడు సమాధానం ఇస్తూ.. సంసార జీవితంలో చిన్న సమస్యలే పెద్దగా మారుతుంటాయి. పెళ్లై ఆరు సంవత్సరాలు అవుతుంది అన్నావుగా.. ఇన్ని రోజులు నీ మాట వినలేదంటున్నావు. అయితే అతనికి ఎవరంటే ఎక్కువగా ఇష్టం ఉంటుందో వారితో చెప్పింపించు. నీవు అపరిశుభ్రతతో ఎంత ఇబ్బంది పడుతున్నావో తెలుస్తోంది. కానీ ప్రతీ సారి నువ్వు చెప్పడం వలన సమస్యలు ఎక్కువవుతాయి. సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవాలి.
కుటుంబం మొత్తం అలానే ఉంటారు అంటున్నావు కాబట్టి, ఆ అలవాట్లు మారడానికి సమయం పడుతుంది. మీరు మరికొంత కాలం మీ ప్రేమతో ఆ అలవాటును మార్పించండి. అయినా మారకపోతే మానసిక నిపుణులను సంప్రదించండి అంటూ సమాధానం ఇచ్చారు.
ఇవి కూడా చదవండి:
గాఢనిద్రలోకి జారుకోవాలంటే.. పడుకునే ముందు ఈ టీ ఒక్క కప్పు తీసుకుంటే చాలు..