Viral Video : వామ్మో ఇంత పెద్దదా.. ఇలాంటి దోశ మీరెప్పుడూ చూసుండరు!

by Javid Pasha |
Viral Video : వామ్మో ఇంత పెద్దదా.. ఇలాంటి దోశ మీరెప్పుడూ చూసుండరు!
X

దిశ, ఫీచర్స్ : మనం తినే రోజువారీ టిఫిన్లలో దోశ ఒకటి. ఇందులోనూ రకరకాలు ఉంటాయి. కొందరికి ఉప్మా దోశ ఇష్టమైతే.. మరి కొందరు మసాలా దోశ తినడానికి ఇష్టపడుతుంటారు. సాధారణంగా ఇవి గుండ్రంగా టిఫిన్ ప్లేట్ సైజులోనో, మహా అయితే లంచ్ ప్లేట్‌ సైజులోనో ఉంటాయి. కానీ ఇందుకు భిన్నంగా ఓ పెద్ద దోశకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇది చూసినవారు ప్రపంచంలో పెద్ద దోశ ఇదే కావచ్చు అని అభిప్రాయడుతున్నారు.

వైరల్ వీడియో ప్రకారం.. అదొక రెస్టారెంట్‌. అక్కడ టేబుల్‌ వద్ద టిఫిన్ చేసేందుకని కస్టమర్ల ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంతలోనే వెయిటర్ ఓ భారీ సైజు దోశను అక్కడికి తీసుకొచ్చాడు. దానిని ప్లేట్లో నిలువుగా పెట్టగా అందరూ ఆనందంగా, ఆశ్చర్యంగా దానిని అలా చూస్తూ ఉండిపోయారు. అక్కడ కూర్చున్న వారిలో ఓ వ్యక్తి దానిని తినడం ప్రారంభించాడు. చుట్టు పక్కల ఉన్నవారు ఈ దృశ్యాన్ని ఎంతో ఉత్సాహంగా చూస్తున్నారు. ఇది చూసిన పలువురు ప్రపంచంలో ఇదే పెద్ద దోశ కావచ్చు అని అభిప్రాయపడగా.. తమిళ నాడులో, ముఖ్యంగా చెన్నైలో ఇంతకంటే పెద్ద దోశలు ఉంటాయని కూడా పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా పెద్దసైజు దోశకు సంబంధించిన వీడియో తెగ అవుతుండగా.. ఎంతో మందిని ఆకట్టుకుంటోంది.

Video Credits to Cristianbrucki Insta Id

Advertisement

Next Story

Most Viewed