మీ ప్రేమ గెలవాలా.. ఈ మొక్కతో ప్రపోస్ చేయండి!

by Jakkula Samataha |
మీ ప్రేమ గెలవాలా.. ఈ మొక్కతో ప్రపోస్ చేయండి!
X

దిశ,ఫీచర్స్ : ఫిబ్రవరి అనగానే అందరికీ గుర్తు వచ్చేది ప్రేమికుల రోజు. వారం రోజుల్లో వాలెంటైన్స్ డే వచ్చేస్తుంది. దీంతో ప్రేమికులు తెగ హైరానా పడిపోతూ ఉంటారు.తమ ప్రియుడు లేదా ప్రేయసికి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలి. ఏ రోజు ఏ బహుమతి ఇస్తే తాను సంతోషపడుతుందని ఆలోచిస్తుంటారు. అయితే అలాంటి వారికి బెస్ట్ ఆప్షన్ ఇదేనంట.ప్రేమించిన వారికి కొందరు కాస్లీ గిఫ్ట్ ఇస్తే, మరికొందరు సిపుల్ గిఫ్ట్స్ ఇస్తుంటారు. అయితే కొన్ని రకాల గిఫ్ట్స్ ఇస్తే విడిపోతారు అందుకే కీ చైన్ లాంటి గిఫ్స్ ఇవ్వకూడదు, ఎప్పుడూ గుర్తుండి పోయే విడిపోకుండా ఉండే బహుమతులు ఇవ్వాలని చాలా మంది అంటుంటారు.

అయితే ప్రియుడు లేదా ప్రియురాలు తమ లవర్స్‌కు ఈ మొక్కను గిఫ్ట్‌గా ఇస్తే, వారి ప్రేమ బలపడటమే కాకుండా, వారి పెళ్లి అయ్యే అవకాశం ఎక్కువంట. అది ఏమిటంటే? రెడ్ ఆంథూరియం ప్లాంట్. వాలెంటైన్స్ డేకి ప్రత్యేకమైన మొక్కల్లో ఇదే మొదటి స్థానంలో ఉంటుంది. దీని ఆకులు అనేవి అచ్చం హార్ట్ షేప్‌లా ఉంటాయి. చూడటానికి కూడా ఇది ఎంతో అందంగా కనిపిస్తుంది. ఇది మీరు ఇస్తున్న వ్యక్తికి అభిరుచి, ప్రేమ, ఆనందాన్ని సూచిస్తుంది. ఈ మొక్కను మీరు ప్రేమించిన వారికి ఇవ్వడం వలన మీ ప్రేమ బలపడటమే కాకుండా, త్వరగా పెళ్లి అయ్యేవ అవకాశం ఎక్కువంట.

Advertisement

Next Story