రైతా డిష్ పేరుతో టూరిజం ప్లేస్.. చూశారంటే అదుర్స్..

by Sumithra |
రైతా డిష్ పేరుతో టూరిజం ప్లేస్.. చూశారంటే అదుర్స్..
X

దిశ, ఫీచర్స్ : భారతదేశంలో చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఆగ్రా, రాజస్థాన్, వారణాసి వంటి ప్రదేశాలకు భారతీయులు మాత్రమే కాకుండా విదేశీ పౌరులు కూడా ఈ ప్రదేశాలన్నింటినీ సందర్శించడానికి వస్తారు. కానీ మీరు ఎప్పుడైనా ఒక వంటకం పేరు పెట్టిన ప్రదేశాన్ని చూసి ఉండరు. అదేంటి వంటకం పేరుతో ప్రసిద్ది చెందిన ప్రాంతం ఉందా అనుకుంటున్నారా.. ఇది కొంచెం వింతగా అనిపించవచ్చు కానీ రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఇలాంటి ప్రదేశం ఉంది. దీని పేరు రైతా హిల్స్.

రైతా హిల్స్ లేక్ సిటీ ఉదయపూర్‌లో ఉంది. నిజానికి ఇది రాజస్థాన్‌లోని అత్యంత సుందరమైన, పురాతన ప్రదేశాలలో ఒకటి. చారిత్రక ప్రాధాన్యత కలిగిన రాజస్థాన్‌లోని ఉదయపూర్‌ను సందర్శించేందుకు విదేశాల నుంచి ప్రజలు వస్తుంటారు. మరి ఉదయపూర్‌లోని పర్యాటక ప్రదేశమైన రైతా హిల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రైతా హిల్స్ ఎక్కడ ఉంది ?

రైతా హిల్స్ ఉదయపూర్‌లోని ఒక చిన్న గ్రామంలో ఉంది. ఇక్కడ కేవలం 150 ఇళ్లు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ జనాభా 650 మాత్రమే. ఇక్కడ పచ్చని లోయలు, ప్రకృతి అందాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. రైతా హిల్స్ ఉదయపూర్ నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది.

దానికి పేరు ఎలా వచ్చింది ?

ఈ కొండల పేరు రైతా.. ఇక్కడ వాతావరణం సాధారణంగా చాలా చల్లగా ఉంటుంది. వర్షాకాలం ఈ ప్రదేశాన్ని మరింత పచ్చగా మారుస్తుంది. ముఖ్యంగా ప్రకృతిని ప్రేమించే వారు తప్పకుండా ఇక్కడికి వచ్చి సందర్శించాలి. ఇంకా విశేషమేమిటంటే ఎత్తైన రైతా కొండల మీద నుండి ఉదయపూర్ మొత్తం అందమైన దృశ్యం కనిపిస్తుంది.

సూర్యాస్తమయం వీక్షణ

ఇక్కడ సూర్యాస్తమయం జరుగుతున్నప్పుడు ఈ ప్రదేశం అందం పెరుగుతుంది. ఇక్కడ సూర్యాస్తమయం దృశ్యం చూడదగినది. సూర్యాస్తమయం సమయంలో ఇక్కడి కొండలు బంగారు రంగులోకి మారుతాయి. ఇది కాకుండా రైతా హిల్స్ పిక్నిక్ స్పాట్‌గా కూడా ప్రసిద్ధి చెందింది. ప్రజలు తమ కుటుంబం, స్నేహితులతో ఇక్కడకు చేరుకుని ప్రకృతిని ఆస్వాధిస్తారు. మీరు కూడా ఉదయపూర్ వెళుతున్నట్లయితే ఇక్కడ ఉన్న రైతా హిల్స్‌ను సందర్శించవచ్చు.

Advertisement

Next Story