ఇష్టమైన వ్యక్తికి ప్రపోజ్ చేస్తున్నారా.. అయితే ఇది గుర్తుంచుకోండి

by Prasanna |   ( Updated:2023-07-02 09:42:58.0  )
ఇష్టమైన వ్యక్తికి ప్రపోజ్ చేస్తున్నారా.. అయితే ఇది గుర్తుంచుకోండి
X

దిశ, ఫీచర్స్ : ఒక వ్యక్తిని మీరు ఇష్టపడుతున్నారు. కానీ మీ మనసులో మాటను చెప్పడానికి మాత్రం ధైర్యం చాలదు. అంటే ఇక్కడ మీకు ధైర్యం లేక ఇలా జరగుతుందనుకుంటే పొరపాటే.. ఆ వ్యక్తిపై గుండెలోతుల్లో దాగున్న ప్రేమ ఆడే దోబూచులాటే ఈ భయానికి కారణమట. అందుకే ఎంత టాలెంట్ ఉన్న వ్యక్తులైనా, ఎంత ఆత్మ విశ్వాసం గలవారైనా తాము అత్యంత ఇష్టపడే వ్యక్తికి ప్రేమను తెలియజేయడానికి మనసుతో పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తుందని ది బీర్స్ (De Beers) సంస్థ నిపుణులు నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ఇక ఇదే ఫీలింగ్ చాలామందికి తమ భాగస్వామిని వెతుక్కునే క్రమంలో, నిశ్చితార్థం వేళలో కూడా కలుగుతుందట.

ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మంది తమ పార్టనర్‌కు లేదా ప్రేమించే వ్యక్తికి ప్రపోజ్ చేసేందుకు, వారిని చూసి ఇష్టపడినప్పటి నుంచి లేదా పరిచయం ఏర్పడినప్పటి నుంచి దాదాపు 8 నెలలు ఆలోచిస్తారట. మరికొందరు తమ సన్నిహిత స్నేహితుల ద్వారా, లేదా ఇంటర్నెట్ ఆధారంగా కనీసం 30కి పైగా సూచనలు, సలహాలు తీసుకుంటున్నట్లు సర్వేను విశ్లేషించిన నిపుణులు అంటున్నారు. అయితే 54 శాతం మంది ఒకరి పట్ల ఒకరు ఆకర్షితులయ్యాక వారి మధ్య అప్పటికే పరిచయం ఉంటే గనుక.. పరోక్షంగా తమను ప్రపోజ్ చేసేలా ఎదుటి వ్యక్తికి సూచనలు చేస్తుంటారని కనుగొన్నారు. ప్రపోజ్ చేయడంలో, తమ ఇష్టాన్ని ప్రదర్శించడంలో అత్యంత ఆదరణ పొందిన చిహ్నాలుగా చేతికి తొడిగే రింగ్స్‌, టాయ్స్, గులాబీలు, ఫ్లవర్ బొకేలు, టెక్ట్స్‌లు ఉంటున్నాయి. 59 శాతం మంది తమకు ఇష్టమైన వ్యక్తికి అనుకోకుండా రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేయాలని భావిస్తుండగా, 45 శాతం మంది టెక్ట్స్ మెసేజెస్ లేదా ఈ మెయిల్స్ ద్వారా ట్రై చేస్తున్నారు. ఇక మరో 38 శాతం మంది సంభాషణల మధ్య తమ మనసులో మాట బయట పెట్టడానికి ట్రై చేస్తున్నారట. అసలు విషయం ఏంటంటే.. 75 శాతం మంది ఇవేవీ లేకుండానే కేవలం గులాబీలు ఇవ్వడం ద్వారా, నోటిమాటగా ఐ లవ్ యూ చెప్పడం ద్వారా ప్రపోజ్ చేస్తున్నారు. అయినప్పటికీ తర్వాత నిశ్చితాంతం లేదా పెళ్లి చేసుకునే క్రమంలో భాగస్వామికి రింగ్ తొడిగించడానికి చాలా ఇష్టపడుతున్నారని సర్వే పేర్కొన్నది.

Read More..

నిద్రలేని రాత్రులు గడుపుతున్న పేరెంట్స్.. అందుకేనట

చాలామంది తమకు ఇష్టమైన ప్రదేశంలోనే కూర్చుంటారు.. ఎందుకో తెలుసా?

Advertisement

Next Story