- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అలా అడిగేసరికి ఏం చెప్పాలో తోచక..యువతీ యువకులు చేస్తున్న పని ఇదే !
దిశ, ఫీచర్స్ : ఓ 25 ఏండ్లు దాటిన యువతీ యువకులకు తరచూ ఎదరయ్యే ప్రశ్న ఏంటో తెలుసా?.. ‘నీ పెళ్లి ఎప్పుడు. ఇంకెప్పుడు చేసుకుంటావు?’ అని. బంధువులు, స్నేహితులు, పరిచయస్తులు ఎవరు కలిసినా దాదాపు ఇలాంటి ప్రస్తావనే తెస్తుంటారు. కారణాలేమైనా కావచ్చు. కానీ.. తమ వ్యక్తిగత విషయాల్లో ఇతరులు ఎక్కువగా జోక్యం చేసుకోవడం, ప్రశ్నించడం ఎవరికైనా నచ్చదు. ప్రజెంట్ ఇలాంటి బాధితులు ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతున్నట్లు న్యూయార్క్‌కుకు చెందిన మానసిక నిపుణుడు అలిషన్ అబ్రామ్స్ అంటున్నారు. అతను తన బృందంతో కలిసి తరచూ యువత ఎదుర్కొంటున్న ఇబ్బందికరమైన ప్రశ్నలపై సర్వే నిర్వహించారు. అయితే వరల్డ్ వైడ్‌గా 40 ఏండ్లలోపు వారిలో 36 శాతంకంటే ఎక్కువమంది వివిధ కారణాలతో ఒంటరిగా జీవించడానికి మొగ్గుచూపుతున్నట్లు తేలింది. వీరిలో సగంమందికిపైగా సరైన జోడీ దొరకని కారణంగా కూడా పెళ్లి చేసుకోలేక ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు.
కాగా సొసైటీ తమను చులకనగా చూస్తోందని, తరచూ పెళ్లి ప్రస్తావన తెచ్చి మానసికంగా ఇబ్బంది పెడుతుందని న్యూయార్క్ సిటీకి చెందిన ఓ 36 ఏండ్ల వ్యక్తి తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సమస్య ఇతనొక్కడిదే కాదు. పెళ్లి కాని అనేకమంది యువతీ యువకులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఇండియాలోనూ వయస్సుమీద పడిన బ్యాచిలర్స్ సంఖ్య గతంతో పోల్చితే 4 రెట్లు పెరుగినట్లు నిపుణులు చెప్తున్నారు. ఇంకొందరు సరైన జోడీదొరకక ఒంటరి జీవితాన్ని నెట్టుకొస్తున్నవారు లేకపోలేదు. అయితే యువతలో తలెత్తుతున్న ఇటువంటి ‘ఒంటరి’ జీవితాన్ని కొందరు నిపుణుల ‘సింగిల్ షేమింగ్’ అని కూడా పిలుస్తున్నారు. డేటింగ్ సర్వీస్ మ్యాచ్ ఆర్గనైజేషన్ నిర్వహించిన ఒక సర్వే ప్రకారం యూకేలోని ప్రతి వెయ్యిమంది వయోజనుల్లో 52 శాతం మంది ఈ సింగిల్ షేమింగ్ లైఫ్‌ను ఎదుర్కొంటున్నారు. ఇక అమెరికా సెన్సస్ డేటా ప్రకారం అయితే 2012లో సింగిల్ లైఫ్ గడిపేవారి సంఖ్య 27 ఉండగా, ఇప్పుడది 58 శాతానికి పెరిగి ఉంటుందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే వయస్సు మించిపోయినప్పటికీ పెళ్లిచేసుకోకుండా ఒంటరిగా ఉంటున్న యువకులను బ్యాచిలర్లు అని పిలుస్తుండగా,యువతునలను మాత్రం ‘స్పిన్‌స్టెర్లు’ అని పిలుస్తున్నారు. ఏది ఏమైనా పెళ్లి చేసుకోకుండా గడుపుతున్న యువత మాత్రం సమాజానికి సమాధానం చెప్పుకోక కాస్త ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఇటీవల పెరుగుతున్నాయి.