- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గర్భిణులపై మెంటల్ హెల్త్ ఎఫెక్ట్.. నెలలు నిండకుండానే ప్రసవించే అవకాశం !
దిశ, ఫీచర్స్ : గర్భధారణ తర్వాత తొమ్మిది నెలలు నిండాక బిడ్డకు జన్మనివ్వడం అనేది నాచురల్ మెటర్నిటీ ప్రాసెస్. దీనివల్ల తల్లీ బిడ్డలకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అయితే అరుదుగా కొందరు నెలలు నిండకముందే డెలివరీ అవుతుండటం కూడా జరుగుతూ ఉంటుంది. దీనిని ప్రీటెర్మ్ బర్త్ అని కూడా పిలుస్తారు. పోషకాహారలోపం, ఫిజికల్ వీక్‌నెస్, రక్తహీనత ఇందుకు ప్రధాన కారణం అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ గర్భిణుల మానసిక అనారోగ్యం కూడా 50 శాతం వరకు నెలలు నిండక ముందే ప్రసవానికి కారణం అవుతుందని ‘లాన్సెట్ సైకియాట్రీ’లో పబ్లిషైన ఒక అధ్యయనం పేర్కొంటున్నది.
గర్భిణుల మానసిక ఆరోగ్యం వారి ప్రసవంపై ఎటుంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవడానికి యూనివర్సిటీ ఆఫ్ ఎక్సెటర్ అండ్ కింగ్స్ కాలేజ్ ఆఫ్ లండన్, లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ & ట్రాపికల్ మెడిసిన్‌కు చెందిన పరిశోధకులు ఇంగ్లండ్ కేంద్రంగా రెండు మిలియన్ల మంది గర్భిణులకు సంబంధించిన డెలివరీస్ డేటాను ఎనలైజ్ చేశారు. దీని ప్రకారం మెంటల్ హెల్త్ ఇష్యూస్‌తో చికిత్స పొందిన ప్రతీ 10 మందిలో ఒకరు నెలలు నిండకముందే ప్రసవించడం జరుగిందని పరిశోధకులు గుర్తించారు. ఎటువంటి మానసిక ఆరోగ్య సమస్యలు లేనివారితో పోలిస్తే, గతంలో మెంటల్ హాస్పిటల్స్‌లలో చేరిన స్త్రీలు ముందస్తుగా బిడ్డకు జన్మనిచ్చే అవకాశం దాదాపు రెండు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు మరో సందర్భంలోనూ పరిశోధకులు గుర్తించారు. అయితే మెంటల్ హెల్త్ ఇష్యూస్ హిస్టరీ కలిగిన స్త్రీలల్లో ఇటువంటి అవకాశం మరింత రిస్క్‌ను పెంచే అవకాశం ఉంటుందని ప్రధాన పరిశోధకుడు, మెంటల్ హెల్త్ నిపుణుడు అయిన లూయిస్ హోవార్డ్ పేర్కొంటున్నాడు.
Read More: గర్భిణీలు ధానిమ్మ తినడం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో?