చెమట వాసనతో ట్రీట్మెంట్.. బెస్ట్ రిజల్ట్స్

by Vinod kumar |   ( Updated:2023-03-29 15:32:04.0  )
చెమట వాసనతో ట్రీట్మెంట్.. బెస్ట్ రిజల్ట్స్
X

దిశ, ఫీచర్స్: మానసిక ఆరోగ్య సమస్యలకు ఇప్పటికే వివిధ రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అయితే చెమట వాసనను రోగులు పసిగట్టే తీరును బట్టి కూడా వారి మెంటల్ కండిషన్‌ను అంచనా వేసి ట్రీట్మెంట్ అందిస్తే మెరుగైన ఫలితం ఉంటుందని తాజా అధ్యయనం చెప్తోంది. ఇందులో భాగంగా పరిశోధకులు వాలంటీర్ల నుంచి సేకరించిన చెమట శాంపిల్స్‌ను విశ్లేషించారు. యూరోపియన్ సైకియాట్రిక్ అసోసియేషన్ (EPA) అధ్యయనం ప్రకారం.. రోగులు మానవ ‘కీమో-సిగ్నల్స్’కు గురైనప్పుడు సామాజిక ఆందోళన(social anxiety) తగ్గుతుందని పరిశోధకులు నిరూపించారు. వాలంటీర్ల అండర్ ఆర్మ్ చెమటను సేకరించి విశ్లేషించడం ద్వారా ఈ విషయాన్ని కనుగొన్నారు.

‘‘మా ప్రాథమిక అధ్యయనం ఫలితాల ప్రకారం కీమో-సిగ్నల్స్‌‌ను మైండ్‌ఫుల్‌నెస్ థెరపీతో కలపడంవల్ల సోషల్ యాంగ్జైటీ తగ్గింది’’ అని స్టాక్‌హోమ్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ప్రధాన పరిశోధకురాలు ఎలిసా విగ్నా చెప్పారు. పరిశోధకులు సోషల్ యాంగ్జైటీకి గురవుతున్న 15 నుంచి 35 ఏళ్లలోపు వయస్సు గల 48 మంది మహిళలను పరిశీలించారు. 16 మందిని మూడు గ్రూపులుగా విభజించారు. వీరు వివిధ వ్యక్తుల నుంచి సేకరించిన చెమట నమూనాల వాసనకు ప్రభావితమైన పరిస్థితిని గమనించారు.

ఎవరైనా సంతోషంగా ఉన్నప్పుడు వారి శరీరం నుంచి ఏర్పడే చెమట వాసన, అలాగే భయంకరమైన సినిమా క్లిప్‌ని చూసి భయపడిన వ్యక్తి శరీరం నుంచి వెలువడే చెమట వాసనను గమనించినట్లయితే డిఫరెంట్‌గా ఉంటుందని, మానసి రోగుల్లో ఈ వాసనను పసిగట్టి వారు ఎటువంటి పరిస్థితులకు ప్రభావితమయ్యారు. ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలనేది తెలుస్తుందట. అలా తెలుసుకున్న తర్వాత బాధితులకు ‘మైండ్‌ఫుల్‌నెస్ థెరపీ’తోపాటు ‘కీమో సిగ్నల్స్’ ప్రభావానికి (చంకల్లోని చెమట వాసనకు) గురి చేయడం ద్వారా మానసిక రోగుల్లో ఆందోళన 39 శాతం తగ్గిందని నిపుణులు చెప్తున్నారు.

Also Read..

చాక్లెట్.. కుక్కలకు ప్రాణాంతకం..

Advertisement

Next Story