అపరిచితులతో భార్యల శృంగారం.. దగ్గరుండి పంపిస్తున్న భర్తలు.. ఏకంగా ఏడుసార్లు సెక్స్!

by Sumithra |   ( Updated:2023-06-16 07:26:23.0  )
అపరిచితులతో భార్యల శృంగారం.. దగ్గరుండి పంపిస్తున్న భర్తలు.. ఏకంగా ఏడుసార్లు సెక్స్!
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో మనం ఎప్పుడూ కనని, వినని వింత ఆచారాలు, కట్టుబాట్లు ఉంటాయి. ఆ ఆచారాలు ఎంత కఠినంగా ఉన్నా తూచా తప్పక పాటించాల్సిందే అన్న శాసనాలు కూడా ఉన్నాయి. టెక్నాలజీ పెరుగుతున్నప్పటికీ కొన్ని తెగలలో ఉండే ఆచారాలు మాత్రం ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉంటారు. అలాంటి ఓ వింత ఆచారమే ఇండోనేషియాలోని జావా ద్వీపంలో కొనసాగుతుంది. అయితే ఆ వింత ఆచారం ఏంటి, ఆ ఆచారాన్ని ఎందుకు తప్పకుండా పాటించాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..


ఇండోనేషియా దేశంలోని జావా ద్వీపంలో ఎవరికైనా కొత్తగా పెళ్లయితే చాలు ఆ జంట తమ పాట్నర్ తో కాకుండా పరాయి వ్యక్తితో సెక్స్ చేయాలంట. అలా ఒక్క రాత్రి మాత్రమే కాదు ఏడాదిలో 7 సార్లు చేయాలంట. వింటుంటేనే చాలా విచిత్రంగా ఉంది కదా. ఈ ఆచారం పూర్వీకుల నుంచి వస్తుందని అక్కడి తెగవారు చెబుతుంటారు. అయితే ఇప్పటి యువతలో కొంత మందికి ఈ ఆచారం ఇష్టం లేకపోయినా ఖచ్చితంగా పాటించాల్సి వస్తుందట.


ఎందుకు పాటించాలి అనే విషయానికి వస్తే మౌంట్ కెముకస్ అనే ఓ పర్వతం జావా ద్వీపంలో ఉంది. ఈ పర్వతానికి మరో ముద్దు పేరు సెక్స్ మౌంటెన్. ఆ పర్వతం పైన ఒక ఆలయం ఉంటుంది. అన్ని ఆలయాల్లోలాగా కాకుండా ఇక్కడి దైవాన్ని ఆరాధించే విధానం కాస్త చిత్రంగా ఉంటుంది. అన్ని ఆలయాల్లో జరిగినట్టుగానే ఈ ఆలయంలో కూడా వేడుకలు జరుగుతాయంట. కాకపోతే అవి పోన్ వేడుకలు. ఈ వేడుకలను ప్రతి ఏడాది నిర్వహిస్తారట. ఆ రోజున ఇండోనేషియాలోని అన్ని ప్రాంతాల ప్రజలు కాలి నడకన ఇక్కడికి వస్తారట. ఈ వేడుకల్లో పెళ్లైన జంటలు అక్కడికి వచ్చే ఇతరులతో అంటే తమకు తెలియని అపరిచిత వ్యక్తులతో శృంగారం చేయాలంట ఇది ఇక్కడి ఆచారం.


ఈ ఆచారం ఎందుకు పుట్టిందనే విషయానికి వస్తే పూర్వం ఆ ప్రాంతాన్ని పాలించిన జావా రాజు కుమారుడు పంకారెన్ సమోద్రోకు, అతని సవతి తల్లి నాయి ఒండ్రోవులాన్‌కు కెముకస్ పర్వతాలలో ఉన్న ఆలయాన్ని అంకితం చేశారంట. పంకారెన్ సమోద్రో, అతని సవతి తల్లి నాయి ఒండ్రోవులాన్ అక్రమ సంబంధాన్ని తెలుసుకున్న రాజు వారిని రాజ్యబహిష్కరణ చేశాడని చరిత్ర చెబుతుంది. దీంతో ఆ ఇద్దరు కెముకస్ పర్వతాలకు వెళ్లిపోయి ఆ పర్వతం పై శృంగారం చేసుకోవడం ప్రారంభించారట. అదిచూసిన కొంత మంది సైనికులు ఆ ఇద్దరి పై దాడి చేసి చంపి అక్కడే సమాధి చేశారట. ఆ తరువాత యువరాజు జ్ఞాపకార్ధం ఒక స్మారక చిహ్నం, ఓ ఆలయాన్ని కెముకస్ పర్వతం పై నిర్మించారట.

అప్పటి నుంచి ప్రతి ఏడాది పోన్ ఉత్సవాన్ని ఆ ఆలయం వద్ద నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. యువరాజు శృంగారాన్ని పూర్తిగా చేయలేదు కాబట్టి అక్కడికి వచ్చిన సందర్శకులు అపరిచితులతో కలిసి శృంగారాన్ని పూర్తి చేయాలని ఆచారం. కొత్తగా పెళ్లయిన జంటలు కూడా అపరిచిత వ్యక్తులతో రాత్రంతా శృంగారంలో పాల్గొనాలని అక్కడి ఆచారం. ఇలా చేస్తే వారికి అదృష్టం కలుగుతుందని అక్కడి వారి నమ్మకం. అంతే కాదు ఉత్సవంలో అపరిచితులతో ఒక్కసారి శృంగారం చేస్తే సరిపోదట. అదే వ్యక్తితో ఏడాదిలో ఏడు సార్లు అదే చోట ఖచ్చితంగా రతిలో పాల్గొనాలని చెబుతారు. అంటే వేడుక జరిగిన ప్రతి 35 రోజులకు ఒకసారి వారు కలవాల్సి ఉంటుందన్న మాట. ఇది ఇండోనేషియాలోని జావా ద్వీపంలో ఉన్న వింత ఆచారం.

ఇవి కూడా చదవండి:

ట్రాన్స్ జెండర్స్ సెక్స్ ఎలా చేస్తారు..? చప్పట్లను ఎందుకు కొడతారు..? (వీడియో)

ఆ రాతి పురుషాంగం దేనికి సంకేతం?

శ్వాస కోశాల్లో నిక్షిప్తమవుతున్న మైక్రోప్లాస్టిక్స్.. అధ్యయనంలో వెల్లడి

Advertisement

Next Story